అధ్యక్షుడిపై డెమొక్రటిక్ మహిళా నేత సంచలన ట్విట్.. Rep. Waters tells Trump to 'Get ready for impeachment'

Donald trump to be impeached get ready for charges warns maxine waters

Donald Trump, impeachment, maxine waters, president, democratic leader, Republican, Hillary clinton, us politics

California Democrat tweeted an update on her quest to remove the president from office, writing simply "Get ready for impeachment." which is now viral on social media

అధ్యక్షుడిపై డెమొక్రటిక్ మహిళా నేత సంచలన ట్విట్..

Posted: 03/22/2017 01:59 PM IST
Donald trump to be impeached get ready for charges warns maxine waters

అగ్రరాజ్యం అధ్యక్షుడిగా జనవరి 20న పదవీ బాధ్యతలను చేపట్టి రమారమి మూడు నెలలు గడుస్తున్న తరువాత కూడా డోనాల్డ్ ట్రంప్ పై ఇంకా అదేశ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనబడుతుంది. తాను ప్రచారం చేసిన పనులనే అయన అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన తరువాత చేస్తున్నా.. అమెరికాలోని కొందరిలో మోదం కనబడుతుండగా, అనేక మందిలో మాత్రం ఖేదం కనిపిస్తుంది. పదవీబాధ్యతలు చేపట్టగానే రెండు మాసాలలో న్యాయస్థాలన చేత మొట్టికాయలు వేయించుకున్న అధ్యక్షుడిగా కూడా అయన నిలిచిపోయారు.

ఇక ఆయన చేపట్టిన ముస్లిం దేశాల వారి నిషేదంపై కూడా అగ్రరాజ్యంలోని పలు విమానాశ్రయాల వద్ద పలు దేశాలకు చెందిన వారు తీవ్రంగా వ్యతిరేకిస్తూ నిరసన ప్రదర్శనలకు దిగుతున్నారు. ఈ తరుణంలో ట్రంప్ కు సానుకూలంగా కూడా గలం వినిపించేవారి సంఖ్య పెరుగుతోంది.. ఈ విషయాలను పక్కనబెడితే.. అమెరికా అధ్యక్షుడైన ట్రంప్ కు ఏకంగా వార్నింగ్ ఇచ్చేశారు ఓ మహిళా నేత. హిల్లరీ క్లింటన్ అధ్యక్షబరిలోకి దిగిన డెమొక్రటిక్ పార్టీకి నుంచి కాలిఫోర్నియాకు చెందిన నేత మాక్జిన్ వాటర్స్..  ట్రంప్ పై చేసిన సంచలన ట్విట్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.  

ట్రంప్ ఎక్కువ కాలం శ్వేతసౌదంలో కొనసాగరని, త్వరలోనే అయన అభిశంసనకు గురవుతారని, అందుకు ఆయన సిద్దంగా వుండాలని పేర్కొంటూ ట్విట్ చేశారు. ట్రంప్ అంటూ అమె అతని పేరును నేరుగా ప్రస్తావించకపోయినా.. పరోక్షంగా మాత్రం అమె.. ట్రంప్ కు వ్యతిరేకంగా ట్వింట్ చేశారు. గతంలోనూ పలుమార్లు అద్యక్షుడు ట్రంప్ కు వ్యతిరేకంగా అభిశంసన ప్రతిపాదనను తెరమీదకు తీసుకువచ్చారు. అంతేకాకుండా రష్యాతో పాటుగా పుతిన్ తో సబంధాలున్నాయన్న అరోపణలను ప్రస్తావించిన అమె.. ట్రంప్ తన తప్పులకు ఏదో ఒక్క రోజు అభిశంసనకు గురికాకతప్పదన్నారు.

ఈ క్రమంలోనే ఆమె మరోసారి అభిశంసనకు సిద్దంగా ఉండు అంటూ ట్రంప్‌ను హెచ్చరించడం గమనార్హం.. ఇదిలావుంటూ అమె చేసిన ట్విట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అమె ట్విట్ చేసిన నాలుగు గంటల వ్యవధిలోనే దానిని 30 వేల మంది లైక్ చేయగా, దాదాపుగా 2900 మంది దానిపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఇక వాటర్స్ ట్విట్  ను 12 వేల మంది రీట్విట్ లతో పంచుకున్నారు. దీంతో అమెరికాలో ట్రంప్ పై వున్న వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles