అక్కడ టిష్యూ పేపర్లను అస్సలు దొంగతనం చేయలేరు.. ఎందుకో తెలుసా? | Bad Time for toilet paper crooks

Face recognition flushes for toilet paper thieves

Toilet-Paper Thieves, China Toilet-Paper Thieves, Facial Recognition Toilet Paper, Indian Toilet Tissues, Toilet Paper in India, Tissue Paper Thieves

Facial recognition tech takes on Beijing's toilet-paper thieves.

టాయ్ లెట్ పేపర్ల దొంగలకు బ్యాడ్ టైమ్

Posted: 03/22/2017 01:35 PM IST
Face recognition flushes for toilet paper thieves

చెప్పుకోవటానికి సిల్లీగా అనిపించినప్పటికీ చైనా లో టాయ్ లెట్ పేపర్ల దొంగలు భారీ ఎత్తునే నష్టాన్ని కలిగిస్తున్నారు. ముఖ్యంగా పర్యాటక ప్రాంతాల్లో ఏర్పాటు చేసే పేపర్ విషయంలో ఇది మరీ ఎక్కువగా ఉంటుంది. గత ఒక్క ఏడాదిలోనే ఇండియన్ కరెన్సీ ప్రకారం సుమారు 30 నుంచి 40 కోట్ల దాకా నష్టం వాటిల్లినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అందుకే వాటిని చెక్ పెట్టేందుకు ఇప్పడు అక్కడి వ్యాపారస్థులు ఓ కొత్త ఉపాయం కనిపెట్టారు.

టాయ్ లెట్స్ లోని పేపర్ రోల్స్ కి సాంకేతిక టెక్నాలజీతో సెన్సార్ లను ఏర్పాటు చేస్తున్నారు. పేపర్ కోసం దాని ముందు నిలబడగానే అది స్కాన్ చేసేస్తుంది.  ఫింగర్ ప్రింట్స్ తోపాటు, ఫేస్ ను కూడా స్కానింగ్ చేస్తుంది. ఒక వ్యక్తి రెండు సార్లు తీసినా లేక అవసరంకు మించి లాగిన టిష్యూ పేపర్ ముఖానికి డిటెక్ట్ చేస్తుంది. పొరపాటున ఎవరైనా అలాంటి వేషాలు వేస్తే వెంటనే ఆ ఫోటోను డేటాలో సేవ్ చేస్తుంది. ఆపై దానిని అధికారులు పబ్లిక్ ప్లేస్ లలో టాయ్ లెట్ పేపర్ దొంగల లిస్ట్ లో ఉంచేస్తారు.

ప్రస్తుతం చైనాలోని పాపులర్ ప్లేస్ ‘టెంపుల్‌ ఆఫ్‌ హెవెన్‌’ బాత్ రూంలలో దీనిని మొదలుపెట్టగా, అది సత్పలితాలను ఇస్తోంది. ఎవ్వ‌రూ చూడ‌లేదని జేబుల్లో పెట్టుకుని పోతే మాత్రం వారి పరువు పోయినట్లే. గతంలో ఒలంపిక్స్ సందర్భంగా బర్డ్ నెస్ట్ స్టేడియం వద్ద కూడా సరిగ్గా ఇలాంటి ప్రయోగాన్నే అమలు జరిపి విజయం సాధించారు నిర్వాహకులు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : China  Toilet Paper Thives  

Other Articles

Today on Telugu Wishesh