:ఫేస్ బుక్ లైవ్ లో మైనర్ గ్యాంగ్ రేప్.. కళ్లు అప్పగించి చూసి డజన్ల మంది.. Chicago teen apparently gang-raped on Facebook Live

Dozens watched a teen s gang rape on facebook live

facebook Live, chicago teen, teen gangrape, teen assulted streamed live, gangrape in facebook live, teenage girl, juveniles gangrape, Anthony Guglielmi, america, crime

Chicago Police are searching for as many as six people involved in the sexual assault of a teenage girl that was broadcast on Facebook Live, a police spokesman said.

ఫేస్ బుక్ లైవ్ లో మైనర్ గ్యాంగ్ రేప్.. కళ్లు అప్పగించి చూసి డజన్ల మంది..

Posted: 03/22/2017 12:09 PM IST
Dozens watched a teen s gang rape on facebook live

అమెరికాలోని చికాగోలో దారుణం జరిగింది. ఓ పదినేళ్ల మైనర్ బాలికపై ఐదుగురు నుంచి ఆరుగురు మగమృగాళ్లు అఘాయిత్యానికి తెగబడ్డాయి. లైంగిక దాడులకు తెగబడిన ఘటన మొత్తాన్ని వారు ఫేస్ బుక్ లైవ్ ద్వారా ప్రసారం కూడా చేశారు. బాలికపై జరుగుతున్న ఈ దారుణాన్ని డజన్ల మంది వీక్షించారు కూడా. అయితే వారిలో ఎవరూ కూడా పోలీసులకు సమాచారం అందించకపోగా, కళ్లప్పగించి చూశారు. అగ్రరాజ్యంగా పేరోందిన అమెరికాలో దారుణాలను అడ్డుకునే నాధుడే కరువయ్యాడు.

వివరాల్లోకి వెళ్తే.. చికాగోలోని ఓ పదినేళ్లు బాలిక షాపుకంటూ ఇంట్లోంచి బయటకు వెళ్లింది. వెళ్లిన అమ్మాయికి ఎవరో తెలిసిన యువకుడు పలకించడంతో అగింది. ఆ తరువాత బాలిక అదృశ్యమైంది. కాగా బాలిక కనిపించడం లేదని బాలిక కుటుంబసభ్యులు పోలీసులకు పిర్యాదు కూడా చేశారు. అయితే బాలిక తల్లి ఇచ్చిన పిర్యాదుతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు షాకింగ్ విషయం తెలిసింది. బాలిక గ్యాంగ్ రేప్ కు గురైందని తెలుసుకుని.. ఒంటరిగా వున్న బాధితురాలిని ఘటనాస్థలం నుంచి తరలించి చికిత్స నిమిత్తం అస్పత్రికి తరలించారు.

కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులకు మరో షాకింగ్ విషయం కూడా తెలిసింది. బాలికపై అత్యాచారం ఘటనను ఫేస్ బుక్ లైవ్ ఫీచర్ ద్వారా ప్రసారం జరిగిందని, దానిని కనీసం 40 మంది లైవ్ లో వీక్షించారని కూడా పోలీసుల దర్యాప్తులో తెలిసింది. అయితే ఈ ఘటనను వీక్షించిన వారెవ్వరు కూడా ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించలేదని, దారుణాన్ని అపే ప్రయత్నం కూడా చేయలేదని, కనీసం తమ 911 నెంబరు కూడా ఫోన్ చేసి తెలపలేదని తెలిపారు. నెట్ జన్లు నిర్లక్ష్య వైఖరిపై కూడా పోలీసులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు పాల్పడిన నిందితులలో మైనర్ బాలురు కూడా వున్నారని పోలీసులు గుర్తించారు. వారందరినీ అరెస్టు  చేసేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles