ఘోర ప్రమాదం.. మీడియాలో ఏం చూపించారు.. అసలేం జరిగింది? | Media mislead South Sudan plane crash.

South sudan plane crash just injuries

South Sudan, Plane Crash, South Sudan Plane Crash, Wau Airport, Wau Airport lane Crash, International News, Plane Crash News, South Sudan News, Plane Crash Wau Airport

South Sudan plane crashes, all 49 passengers, crew survive. several injured after passenger aircraft bursts into flames at Wau airport.

విమానం కుప్పకూలింది.. 50 మంది బతికారు

Posted: 03/21/2017 09:01 AM IST
South sudan plane crash just injuries

విమానం కుప్పకూలినా సుమారు 50 మంది, విమాన సిబ్బంది ప్రాణాలతో సురక్షితంగా బయటపడిన ఘటన దక్షిణ సుడాన్ లో జరిగింది. భారత కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 7:30 గంటల ప్రాంతంలో వావు విమానాశ్రయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ప్రయాణికుల క్షేమ సమాచారం పై మీడియాలో తొలుత వేర్వేరు కథనాలు రావటం కొసమెరుపు.

ఎయిర్ పోర్ట్ లో విమానం ల్యాండ్ అయ్యే సమయంలో ఒక్కసారిగా కుదుపులు రావటంతో ఏం జరుగుతుందో అర్థం కానీ పరిస్థితిలో ప్రయాణికులు ఉండిపోయారు. తొలుత విమానం కంట్రోల్ కాలేదని పైలెట్ ఆంటోనోవ్(26) చెబుతున్నాడు. విమానం హఠాత్తుగా నెలకొరిగిన సమయంలో డోర్ ఓపెన్ కావటం, ఆపై ప్రయాణికులంతా దూకేయటం జరిగిందని, ఆపై అది మంటల్లో కాలిపోయిందని, గాయపడ్డ వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు అతను వివరించాడు.

అయితే కాగా, ఈ ఘటనపై కథనాలతో ప్రయాణికుల బంధువుల్లో ఆందోళనలు నెలకొన్నాయి. విమానంలోని 44 మంది మరణించినట్టు వార్తలు రాగా, కొన్ని వార్తా చానెళ్లు మాత్రం కొంతమంది ప్రాణాలు కోల్పోయినట్టు, పలువురు గాయపడ్డట్టు తెలిపాయి. దానికి తోడు సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ కావటంతో అది మరింత ఎక్కువైంది. అయితే అధికారులు ఆస్పత్రి నుంచి లైవ్ కవరేజ్ ఇచ్చాక అంతా ఊపిరి పీల్చుకున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : South Sudan  Wau Airport  Plane Crash  

Other Articles