మనసు మార్చుకున్న దీప భర్త... ఏం డిసైడ్ అయ్యాడంటే... | Deepa Jayakumar's Husband clear airs.

Deepa jayakumar husband denies new party rumour

MGR Amma Deepa Peravai Party, Deepa Jayakumar, Deepa Jayakumar Husband, MGR Amma Deepa Peravai Madhavan, Deepa Jayakumar Husband New Party, Amma Deepa Peravai

Deepa Jayakumar's husband Madhavan not quits her party MGR Amma Deepa Peravai, to launch new outfit.

దీప అండ్ మాధవన్... ఆల్ ఈజ్ వెల్

Posted: 03/21/2017 09:52 AM IST
Deepa jayakumar husband denies new party rumour

జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ కు షాకిస్తూ ఆమె భర్తదీప జయకుమార్ కొత్త పార్టీ పెట్టబోతున్నాడన్న వార్త గత రెండు రోజులుగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాను అలాంటి పని చేయబోనని, భార్య వెంటే ఉంటానని మాధవన్ స్వయంగా ప్రకటించాడు. దీప పై అంచనాలు రాను రాను పెరిగిపోతుండటంతో కొందరు గిట్టని వాళ్లు ఇలా ప్రచారం చేస్తున్నారంటూ ఆయన మండిపడుతున్నాడు.

అన్నాడీఎంకే లో ద్వితియ, తృతీయ శ్రేణి నేతలు కొందరు బయటికి వచ్చి దీపను జయ వారసురాలిగా ప్రకటిస్తూ ఆమెకు అండగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆమె ఎంజీఆర్ అమ్మ దీపా పేరవై పార్టీని స్థాపించటమే కాదు. అమ్మ నియోజక వర్గం ఆర్కే నగర్ నుంచి పోటీ చేస్తానంటూ ప్రకటించి కలకలమే రేపింది. అయితే పార్టీని విస్తృత పరిచే చర్యల్లో తనకు ప్రాధాన్యత ఇవ్వకపోవటం, పైగా ఇన్ ఛార్జీల నియామకాల్లో తన సలహాలు తీసుకోవటం లేదంటూ అలిగిన ఆయన గత వారం నుంచి ఆమెకు దూరంగా ఉంటున్నారనే వార్త వినిపించింది.

అయితే తన భార్యతో తనకు ఎలాంటి గొడవలు లేవని, కొత్త వార్తలు అవాస్తవమని మాధవన్ ప్రకటించటంతో పార్టీ వర్గాల్లో మళ్లీ ఉత్సాహం రేగింది. ఏది ఏమైనా దీపను సీఎంగా చేసేందుకే తామంతా కృషి చేస్తామని కార్యకర్తల సమావేశంలో ఆయన మీడియాకు ప్రకటించాడు. కాగా, దీపకు మాధవన్ దూరంగా ఉన్నాడన్న వార్త రాగానే, డీఎంకే ఆయన్ని చేరదీసే యత్నం చేసిందన్న మరో పుకారు కూడా వినిపించటం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Deepa Jayakumar Husband  Madhavan New Party  Amma Deepa Peravai Party  

Other Articles