యూపీ కొత్త సీఎంపై అప్పుడే విమర్శలా?.. మోదీ సీక్రెట్ స్పై ఎవరంటే ... | Criticism on UP New CM Yogi Adityanath.

Ram gopal yadav defends up new cm

MP Ram Gopal Yadav , Akilesh Yadav's Uncle, UP New CM, Yogi Adityanath, Yogi Adityanath Criticism, Akilesh Yadav Support Yogi Adityanath, Yogi Adityanath Ram Gopal Yadav, SP Leader Support Yogi, Samajwadi Party Ram Gopal Yadav, CM Yogi Adithyanath SIx Months

SP senior Leader, Akilesh Yadav's Uncle Ram Gopal Yadav defends Yogi Adityanath's appointment as Uttar Pradesh chief minister. Give him at least 6 months hits out at Yogi's critics.

యోగికి ఆరు నెలల టైమిద్దాం!

Posted: 03/21/2017 08:13 AM IST
Ram gopal yadav defends up new cm

ఊహించని గెలుపు, ఆపై ఉత్తరప్రదేశ్ 21వ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ ఇలా ప్రకటించి అలా బాధ్యతలు అప్పజెప్పిందో లేదో రాజకీయ ప్రత్యర్థులు తమ నోటికి పని చెప్పటం ప్రారంభించారు. మరికొందరు మాత్రం ఈ విషయంలో నోరు మెదపకపోవటం మంచిదన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో అఖిలేష్ బాబాయి, సమాజ్ వాదీ పార్టీ నేత రాంగోపాల్ యాదవ్ మాత్రం కాస్త భిన్నంగా వ్యాఖ్యలు చేశారు.

యోగి పని తీరుపై అప్పుడే విమర్శలు గుప్పించడం సబబు కాదని, ఆరు నెలల తర్వాత విమర్శలు గానీ, సమీక్షలు గానీ చేయాలని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. తగినంత సమయం ఇస్తేనే కదా యోగి పని తీరు తెలిసేది అంటూ వ్యాఖ్యానించాడు. కాగా, గోరఖ్ పూర్ నుంచి ఏడుగురు పురోహితులను రప్పించి తన అధికారిక నివాసంలో యోగి పూజలు నిర్వహించారు. దీనిపై వస్తున్న విమర్శలను రాంగోపాల్ యాదవ్ కొట్టి పారేశారు. హిందూ సంప్రదాయం ప్రకారం పూజలు నిర్వహించడం సాధారణమేనంటూ వ్యాఖ్యానించాడు.

ములాయం నుంచి అధ్యక్ష పదవిని లాక్కోవటంలో అఖిలేష్ కు రాజ్యసభ సభ్యుడైన రాంగోపాల్ యాదవ్ సాయం చేశాడనే టాక్ ఉంది. అంతేకాదు కాంగ్రెస్ తో పొత్తు పట్ల నేతాజీ ఇష్టం లేకపోయినా రాంగోపాల్ మూలంగానే అఖిలేష్ ముందుకు సాగి దారుణ ఓటమి చవిచూశాడన్న పార్టీ అంతర్గత విమర్శలు కూడా ఈ మధ్య వినిపిస్తోంది. అయితే ఈ విషయంలో కొడుకు, తమ్ముళ్లనే బాధ్యులను చేయటం సరికాదన్న ములాయం ఓటమికి అందరూ బాధ్యులే అని ప్రకటించటం కొసమెరుపు.

యోగిపై మోదీ కన్ను...

ఉత్తరప్రదేశ్‌ లో ఏర్పాటు చేసిన కొత్త ప్రభుత్వంపై ప్రధాని నరేంద్ర మోదీ డేగ కన్ను వేయబోతున్నాడని తెలుస్తోంది. ఈ మేరకు ఓ ప్రముఖ జాతీయ దిన పత్రిక ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది. యూపీ కేడర్ కు చెందిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి నృపేంద్ర మిశ్రాను యోగి ఆఫీస్ లో నియమించినట్టు తెలుస్తోంది.

పీఎంవో ప్రిన్సిపల్‌ సెక్రటరీ అయిన మిశ్రా సీఎం యోగి ఆదిత్యనాథ్ కు మోదీకి మధ్య సంధాన కర్తగా వ్యవహరించబోతున్నాడని ఆ కథనం పేర్కొంది. దీనిని ధృవీకరిస్తూ.. యోగితో మిశ్రా 45 నిమిషాలపాటు భేటీ అయ్యారు కూడా. నిత్యం యోగితో టచ్ లో ఉంటూ, యూపీ వ్యవహారాలను పర్యవేక్షించనున్నారని తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Uttar Pradesh  New CM  Yogi Adithyanath  SP Leader  Ram Gopal Yadav  

Other Articles

Today on Telugu Wishesh