ఎస్బీఐ మినిమమ్ బ్యాలెన్స్ రూల్స్.. అక్కడ పెద్ద లొల్లే అయ్యింది | Rajyasabha member slams SBI move to charge accounts.

Sbi minimum balance norm draws house fire

State Bank of India, Minimum Balance Rules, Rajya Sabha, CPI, State Bank of India New Rules, SBI Minimum Balance Rules, Rajya Sabha SBI New Rules, CPI SBI Minimum Balance

State Bank of India's decision to hike the minimum balance requirement to Rs 5,000 for account holders from the next fiscal came in for sharp criticism from a number of MPs across party lines in the Rajya Sabha. Anurag Thakur, Opposition demand roll back of withdrawal charges by banks. CPM member slams SBI move to charge accounts.

ఎస్బీఐ కొత్త రూల్స్.. మరీ దారుణం

Posted: 03/21/2017 07:40 AM IST
Sbi minimum balance norm draws house fire

ప్రైవేట్ బ్యాంకులకు తీసిపోకుండా అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు భారతీయ స్టేట్ బ్యాంకు(ఎస్బీఐ) ఇటీవ‌ల తీసుకొచ్చిన ప‌లు నిబంధ‌న‌ల‌పై ఖాతాదారులు ఆగ్రహాంతో ఊగిపోతున్నారు. అవసరమైతే అకౌంట్లు మూసేస్తామే తప్ప వారు పెట్టే అడ్డమైన నిబంధనలను పాటించమని చెప్పేస్తున్నారు. అదలా ఉండగానే బ్యాంకింగ్ వ్యవస్థను దెబ్బ తీసేలా వచ్చే నెలలో నిరసనలకు సిద్ధమౌతున్న విషయం తెలిసిందే. మరోవైపు ఇదే అంశంపై పార్లమెంట్ లో ప్రతిపక్షాలు గళం వినిపించాయి.

రాజ్య‌స‌భ‌లో సోమవారం మధ్యాహ్నాం వాడి వేడి చర్చ జరిగింది. సేవింగ్స్‌ బ్యాంక్‌ ఖాతాలో కనీసం రూ.5 వేల బ్యాలెన్స్ ఉంచాల‌న్న బ్యాంకు నిబంధ‌న‌పై విప‌క్ష స‌భ్యులు గళం ఎత్తారు. కొత్త నిబంధ‌న‌ల‌న్నింటినీ తొల‌గించాల్సిందేన‌ని డిమాండ్ చేశారు. తొలుత సీపీఐ సభ్యుడు కేకే రాజేశ్ ఈ అంశంపై మాట్లాడుతూ మినిమం బ్యాలెన్స్ లేకుంటే జ‌రిమానా విధిస్తామ‌ని ఓ ప్రభుత్వ బ్యాంకు ఇలా చెప్పటం దారుణమని మండిపడ్డాడు. ఆ నిబంధ‌న వ‌ల్ల దాదాపు 31 కోట్ల మంది ఖాతాదారులు ఇబ్బందిప‌డతారని ఆయన అంటున్నాడు.

ప్రభుత్వం చెప్పిందనే బ్యాంకు ఖాతాలు తెరిచి, న‌గ‌దు ర‌హిత లావాదేవీలు చేస్తోన్న పేద‌, మ‌ధ్య‌ త‌ర‌గ‌తి ప్ర‌జ‌లకే ఇది సంకటమని వారంటున్నారు. ఒకేసారి 500 నుంచి 5000 లకు పెంచటమేంటని ప్రశ్నించాడు. కార్పొరేట్ శక్తులను ఏం చేయలేని బ్యాంకులు, లోన్లు తీసుకునే రైతులను టార్గెట్ చేయటం శోచనీయమన్న కాంగ్రెస్ తక్షణమే ఆ నిబంధనలను తొలగించాలని కోరుతూ నినాదాలు చేస్తూ పెద్ద రచ్చే చేసింది. కాగా, వచ్చే నెల 1 నుంచి(ఏప్రిల్ 1) ఖాతాలో మినిమమ్ బ్యాలెన్స్ లేకపోతే భారీగా బాదేందుకు సిద్ధమౌతున్న విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : SBI  Minimum Balance Rules  Rajya Sabha  

Other Articles

Today on Telugu Wishesh