ఊహించని ట్విస్ట్... ఇలాకాలోనూ జగన్ కి షాక్.. మూడు టీడీపీకే... | TDP Candidates Won in Kadapa and Kurnool MLC seats.

Big shock to jagan in mlc elections

MLC Elections, Kadapa MLC TDP, Jagan Shock MLC Results, Local Body MLC Elections, Kurnool MLC Shilpa Chakrapani Reddy, Kadapa YS Vivekananda Reddy Lost, Kurnool TDP MLC

Andhra Pradesh Local Body MLC Poll Results. TDP Candidates B Tech Ravi and Shilpa Chakrapani Reddy wins Kadapa and Kurnool MLC Elections.

జగన్ కి బిగ్ షాక్.. కర్నూలు, కడప కూడా తెదేపాకే...

Posted: 03/20/2017 10:49 AM IST
Big shock to jagan in mlc elections

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతిపక్ష వైసీపీకి చుక్కెదురైంది. కంచుకోటగా ఉన్న కడపతోపాటు, కర్నూలులో కూడా ఓటమి చవిచూసింది. ఇప్పటికే నెల్లూరు స్థానాన్ని వాకాటి కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో మూడు స్థానాల్లో గెలుపుతో టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది. కర్నూలులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శిల్పా చక్రపాణిరెడ్డి విజయం సాధించగా, కడపలో బీటెక్ రవి గెలుపొందాడు. గౌరు వెంకటరెడ్డిపై, శిల్పా 56 ఓట్ల తేడాతో విజయం సాధించినట్టు తెలుస్తోంది. కౌంటింగ్ కేంద్రం వద్దనే ఉండి లెక్కింపును పరిశీలించిన శిల్పా, తన విజయానంతరం కార్యకర్తలతో చేతులు కలుపుతూ, ఆనందంగా కనిపించారు. దీనిపై కాసేపటి క్రితమే అధికారిక ప్రకటన వెలువడింది.

ఇక వైకాపా అధినేత జగన్ సొంత జిల్లా అయిన కడపలో, ఏకంగా వైయస్ రాజశేఖరరెడ్డి తమ్ముడు, జగన్ బాబాయ్ వివేకానంద రెడ్డి ఓటమిపాలు కావడంతో ఆ పార్టీకి పెద్ద షాక్ తగిలింది. ఆయనపై టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి  34 ఓట్లతో విజయదుందుభి మోగించాడు. దీంతో, జగన్ జిల్లాలో ఫస్ట్ టైం టీడీపీ జెండా ఎగిరినట్లయ్యింది.

కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీపై నెలకొన్న అసంతృప్తి తమకు కలిసి వస్తుందని వైకాపా భావించినప్పటికీ, అది వాస్తవ రూపం దాల్చకపోగా, కడపలో అయితే బిగ్ షాక్ తగిలిందనే చెప్పుకోవాలి. ఇక ఎదురేలేని కడప జిల్లాలో తీవ్రంగా శ్రమించినప్పటికీ ఓటమిపాలు కావటంతో వైసీపీ శ్రేణులు తీవ్ర నిరాశకు లోనయ్యాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AP MLC Elections  Kadapa  YSRCP Lost  Kurnool TDP Won  

Other Articles

Today on Telugu Wishesh