మోదీపై లాలూ సూపర్ పంచ్ లు.. గుండు గీయించుకుని చెవి పొగులంటూ... | Lalu's Twitter exchange with Modi will leave you in splits.

Lalu yadav hilarious tweet on modi

Lalu Prasad Yadav, Bihar BJP Leader, Sushil Kumar Modi, Lalu Funny Tweets, Lalu Modi Tweets, Lalu Shave Head Tweets, Lalu Prasad Yadav Hilarious Tweets, Lalu Prasad Strong Retort, :a;iu Prasad Yadav Yogi Swearing Ceremony

Lalu Yadav taunts Sushil Modi over Yogi Adityanath oath-taking. Lalu, Sushil engage in ugly Twitter banter over UP CM's swearing-in

మోదీ, గుండు గీసుకో.. చెవి పొగులు పెట్టుకో...

Posted: 03/20/2017 01:59 PM IST
Lalu yadav hilarious tweet on modi

యూపీలో ఘోర పరాభవంపై సమాజ్ వాదీ పార్టీ, నేతాజీ ములాయం సింగ్ లైట్ తీస్కున్న వేళ ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ మాత్రం తనను ప్రమాణ స్వీకారానికి పిలవకపోవటంపై కూసింత అసహనంతోనే ఉన్నాడు. ఈ క్రమంలో తనపై ట్వీట్లు వేసిన బీహార్ బీజేపీ అధ్యక్షుడు సుశీల్ కుమార్ మోదీపై లాలూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.

"యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి కావడంతో ఆయన్ను ఎలా విమర్శించాలో కూడా తెలియని దిగ్భ్రాంతికర స్థితిలో లాలూ ఉన్నారు" అని సుశీల్ ట్వీట్‌ చేయగా, లాలూ దానికి తగ్గట్లుగానే పంచ్ వేశాడు. "ప్రమాణ స్వీకారానికి నిన్నూ పిలువలేదని బాధపడిపోకు. ఓ పని చేయి గుండు గీయించుకో, చెవులు కుట్టించుకో. కాషాయపు బట్టలు వేసుకో... ఇది నీ తలరాతను మారుస్తుందేమో" అంటూ తనదైన శైలిలో సూపర్
పంచ్ వేశాడు.

"లాలూ మీ పరిస్థితి ఏమిటి?" అని మోదీ ప్రశ్నించగా, తాను బాగానే ఉన్నానని చెబుతూ, "నిన్ను యూపీలోకి అడుగుపెట్టనివ్వలేదు. కాబట్టే, అక్కడ బీజేపీ గెలిచింది" అంటూ మరో కౌంటర్‌ వేశాడు. ప్రస్తుతం లాలూ వేసిన ఆ పంచ్ లు తెగ వైరల్ అవుతున్నాయి. కాగా, ఆదివారం యోగి ప్రమాణ స్వీకారానికి బీజేపీ అగ్రనేతలతోసహా ఎస్పీ నేతలు హాజరుకావటం తెలిసిందే. ఈ సందర్భంగా మోదీ, ములాయం చెవిలో గుసగుసలాడుకోవటం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Lalu Prasad Yadav  Sushil Kumar Modi  Funny Tweets  

Other Articles