టీఆర్ఎస్ ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే.. ఎంతలా తిట్టుకున్నారంటే... | MLA Srinivas Goud Heated Argument with MP Jithender Reddy.

Trs mla srinivas goud allegations on mp jitender reddy

Mahabubnagar TRS Clash, TRS Leaders Clash, TRS MP Versus MLA, MP MLA Fight, Srinivas Goud Ministry, MP Jithender Reddy MLA Srinivas Goud, KCR Jithender Reddy Srinivas Goud

Mahabubnagar TRS Key Leaders Clash. The hostility between MP A.P. Jithender Reddy and MLA V. Srinivas Goud came to the fore while they were addressing the media persons.

స్గేజీ మీదే టీఆర్ఎస్ ఎంపీ-ఎమ్మెల్యే క్లాష్

Posted: 03/20/2017 10:21 AM IST
Trs mla srinivas goud allegations on mp jitender reddy

తెలంగాణలో అధికార పక్షం నేతల మధ్య సత్సంబంధాలు లేవన్న విషయం మరోసారి రుజువైంది. మహబూబ్ నగర్ నేతలు జితేందర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ లు మీడియా సమక్షంలోనే బహిరంగంగానే విమర్శలకు దిగారు. టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం తగాదాలకు వేదిక అయ్యింది. తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుకుంది జితేందర్ రెడ్డేనంటూ శ్రీనివాస్ విమర్శలు చేయటం కలకలం రేపింది.

‘‘నాకు మంత్రి పదవి రాకుండా మీరే అడ్డుకున్నారు. ఆ విషయాన్ని ఓ మంత్రి నాతో చెప్పాడు’’ అంటూ జితేందర్‌ పై శ్రీనివాస్‌గౌడ్ అక్కసు వెళ్లగక్కాడు. దీనిపై స్పందించిన ఎంపీ, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌తో తనకు ఎటువంటి విభేదాలు లేవని, మీడియా కావాలనే లేనిపోని కథనాలు రాస్తోందని ఆరోపించారు. శ్రీనివాస్‌కు మంత్రి పదవి రాకుండా తాను అడ్డుకుంటున్నట్టు ప్రచారం చేయడం సరికాదన్నారు. దీనివెనుక ఉంది తానని నిరూపిస్తే ఎంపీ పదవికి రాజీనామా చేయడంతోపాటు రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు.

మంత్రి పదవి చేపట్టేందుకు తలరాత ఉండాలని, ఎవరో అడ్డుపడితే అది ఆగిపోదంటూ ఆవేశంగా మాట్లాడారు. మంత్రి పదవుల విషయంలో కేసీఆర్ ఒకరు చెబితే వింటారా? అని ప్రశ్నించాడు. ‘‘ఏ మంత్రి చెప్పాడో అతడిని కేసీఆర్ వద్దకు తీసుకెళ్దాం. నేను అడ్డుపడినట్టు నిరూపిస్తే పదవికి రాజీనామా చేసి, రాజకీయాల నుంచి తప్పుకుంటా’ అని మరోమారు సవాల్ విసిరారు. వ్యవహారం ముదురుతుండడంతో పార్టీ నేతలు జోక్యం చేసుకుని సర్ది చెప్పడంతో చివరకు వివాదం సర్దుమణిగింది. అయితే ఇంత జరుగుతున్న సమయంలో ఆ మంత్రి పేరు మచ్చుకైనా బయటికి రాకపోవటం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahabubnagar  TRS Clash  Srinivas Goud  MP Jithender Reddy  

Other Articles