నడిరోడ్డుపై ప్రపోజ్.. యువతికి ఓకే.. క్షమాపణలు చెప్పిన జంట Outrage over boy proposing to girl in public

Outrage over boy proposing to girl in public couple forced to apologise

bhiwandi couple, maharahstra couple, thane couple proposal, muslim couple proposal, muslim couple hugging, bhiwandi couple hugging, thane couple hugging, proposing in public, boy proposing girl in public

A couple from Bhiwandi in Maharashtra invited wrath of local community leaders after a video of them hugging in public went viral on the internet. The boy is seen proposing to the girl in the middle of a busy road in Thane

ITEMVIDEOS: నడిరోడ్డుపై ప్రపోజ్.. యువతికి ఓకే.. క్షమాపణలు చెప్పిన జంట

Posted: 03/18/2017 04:59 PM IST
Outrage over boy proposing to girl in public couple forced to apologise

నూరేళ్ల జీవితం సినిమా మాత్రం కాదు. మూడు గంటల వ్యవధిలో ముగిసిపోయే సినిమాలో చూపని అనేక సమస్యలు, ఇబ్బందులను  మనం నిత్య జీవితంలో ఎదుర్కోంటాం. అంతమాత్రన సినిమాలలో చేసినట్లుగా నడిరోడ్డు మీద ఓ యువకుడి యువతికి తన ప్రేమను వ్యక్తం చేయడం.. ఇప్పడు పెను దుమారాన్నే రేపుతుంది. రోడ్డుపై వాహనాలు వెళ్తుండగా.. నడిరోడ్డుపై ఓ యువకుడు తన యువతిని మోకాళ్లపై నిల్చుని ప్రపోజ్ చేశాడు. ఆ యువతి అతని ప్రేమను అమోదించింది. మహారాష్ట్రలోని భివండిలోని థానే రోడ్డుపై జరిగిన ఈ ఘటన దుమారం రేపుతోంది.

ఇంతవరకు బాగానే వున్నా ఇక్కడ అసలు సమస్య వచ్చిపడింది. నడిరోడ్డుపై ప్రేమను వ్యక్తం చేసి యువతిని తనదాన్ని చేసుకున్నా.. స్థానిక మతనాయకులు మాత్రం ఈ జంట చర్యను తీవ్రంగా తప్పుబడుతున్నారు. వారు మత పెద్దల సమక్షంలో తాము చేసినది తప్పని అంగీకరించాలని, ఆ తరువాత క్షమాపణలు చెప్పాలని అంక్షలు విధించారు. భివండిలో ధానే రోడ్డుపై వాహనాలు రద్దీగా వెళ్తున్న సమయంలో నడిరోడ్డుపై ఈ నెల 11న యువకుడు బురఖా ధరించిన ఓ అమ్మాయికి ప్రపోజ్‌ చేశాడు. యువతి కూడా యువకుడి ప్రేమను అంగీకరించడంతో ఆమెను కౌగిలించుకొని తన ప్రేమను ప్రకటించాడు.

ఈ అనూహ్య ఘటనను చూసి కొందరు వాహనదారులు విస్తుపోయారు. మరికొందరు వారిని ఉత్సాహ పర్చారు. హగ్ చేసుకోమ్మని చుట్టూ మూగిన వారే సలహా కూడా ఇచ్చారు. నడిరోడ్డుపై లవ్ ప్రపోజింగ్ వీడియోను స్థానికులు తమ మొబైల్ ఫోన్లలో షూట్ చేసి సోషల్‌ మీడియాలో పోస్టు చేయగా, అది కాస్తా ఆన్‌లైన్‌లో వైరల్ గా మారింది. దీంతో రంగంలోకి దిగన మతపెద్దలు ఈ కొత్త ప్రేమజంటపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రేమికుల తీరు మతాచారాలకు విరుద్దంగా వుందని, మరీ ముఖ్యంగా తమ ఇస్లాం మతానికి విఘాతం కలిగించేలా వున్నాయిని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.

ప్రేమజంటకు వ్యతిరేకంగా ప్రదర్శనలు నిర్వహిస్తామంటూ మతసంస్థలు, మత పెద్దలు హెచ్చరిస్తున్నారు. నడిరోడ్డు మీద తాను ప్రేమను వ్యక్తం చేయడం తప్పేనని యువకుడు తాను చేసిన చర్యకు విచారం వ్యక్తం చేస్తూ.. క్షమాపణలు చెప్పాడు. ఈ మేరకు యూట్యూబ్‌లో రెండు వీడియోలు పెట్టారు. కాగా తమ కుటుంబానికి తీవ్ర బెదిరింపులు వస్తున్నాయని.. వాటిని వెంటనే అపకపోతే తానే ఆత్మహత్యకు పాల్పడతానని యువతి కూడా మీడియాతో పేర్కొంది. మతపెద్దల బెదిరింపుల నేపథ్యంలో ఆ జంటకు పోలీసులు భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. వారికి, వారి కుటుంబానికి బెదిరింపులు గురిచేసే వారిపై తీవ్రంగా చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Maharashtra  Bhiwandi  boy proposes on road  thane  couple apologise  

Other Articles

Today on Telugu Wishesh