కొత్త సంవత్సరంతోనే ఫైనాన్షియల్ ఇయర్.. Par Panel for shifting fiscal year to January-December

Par panel for shifting fiscal year to january december

fiscal year, indias current fiscal year, fiscal year shift, congress mp m veerappa moily, niti aayog on fiscal year shift, calender year

India should shift to the January-December financial year by ending the decades old tradition of April-March fiscal introduced by the British, a Parliamentary Panel said

కొత్త సంవత్సరంతోనే ఫైనాన్షియల్ ఇయర్..

Posted: 03/18/2017 09:13 AM IST
Par panel for shifting fiscal year to january december

దాదాపుగా మూడు దశాబ్దాల తరువాత ఏకఫక్ష మెజారిటీతో మూడింట రెండొంతుల బలంతో అధికారంలోకి వచ్చిన నరేంద్రమోడీ ప్రభత్వం దేశ ప్రజలకు ముందు సంస్కరణలను ప్రవేశపెడుతుంది. ఇప్పటికే స్వచ్చా భారత్ అంటూ బహిర్భూమిని బహిరంగంగా కాకుండా టాయ్ లెట్లను వినియోగించాలని పెద్ద ఎత్తున్న ఉద్యమంలా చేపడుతుండగా, అటు దే స్థాయిలో పేదలకు జన్ ధన్ యోజనా కింద జీరో బ్యాలెన్స్ అకౌంట్లను కూడా తెరిపించింది. ఇదే క్రమంలో సంస్కరణల పేరిట పాత పెద్ద నోట్లను రద్దు చేసి.. వాటి స్థానంలో కొత్త రెండు వేల రూపాయల నోటుతో పాటు కొత్త 500 రూపాయల నోటును కూడా ప్రవేశపెట్టింది.

ఇక ఎప్పుడో బ్రీటీషు కాలం నాటి విధానాలను ఇప్పటికీ కొనసాగించడంపై విముఖత వ్యక్తం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఫైనాన్షియల్ ఇయర్ ను కూడా సవరించే పనిలో వుంది. క్యాలెండర్ ఇయర్ అనగానే ఠక్కును గుర్తుకు వచ్చేది జనవరి 1. కానీ ఫైనాన్షియల్ ఇయర్ అనగానే ఏప్రిల్ టు మార్చ్ అని గుర్తుకువస్తుంది. అయితే ఈ విధానాన్ని మర్చి.. ఇకపై జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు కొనసాగేలా చర్యలు తీసుకోనుంది. కానీ.. ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి మొదలవుతుంది కాదా మరి దానిని సవరించడం ఏమిటీ అంటారా..?  

మన దేశంతో పాటు పలు దేశాల్లో క్యాలండర్ ఇయర్ – ఫైనాన్షియల్ ఇయర్ రెండూ వేర్వేరుగా ఉన్నాయి. క్యాలెండర్ ఇయర్ జనవరి 1 నుంచి, ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ 1 నుంచి మొదలవుతాయి. కానీ.. కొన్ని దేశాల్లో ఈ రెండు వేర్వురుగా కాకుండా ఒకే తేదీన ప్రారంభమవుతాయి. కాలెండర్ ఇయర్, ఫైనాన్షియల్ ఇయర్ రెండూనూ జనవరి 1 నుంచే ప్రారంభమం అవుతాయి. ఇక మరికోన్ని దేశాల్లో ఫైనాన్షియల్ ఇయర్ జులై నుంచి – ఆగస్టు వ‌ర‌కు ఇలా ఒక్కో దేశంలో ఒక్కో నెల నుంచి ఆర్థిక సంవత్సరం మొదలవుతోంది.

అయితే బ్రిటీష్ పాల‌కులు మన దేశంలో అమలుపర్చిన క్యాలెండర్, ఫైనాన్షియల్ ఇయరల్ లను ఇకపై స్వస్తి పలికి.. రెండింటినీ ఒకసారి వచ్చేలా కేంద్రం చర్యలు చేపడుతుంది. ఈ మేరకు జ‌న‌వ‌రి-డిసెబ‌ర్ ఆర్థిక సంవ‌త్స‌రానికి మారాల‌ని పార్ల‌మెంట్ స్థాయి సంఘం సూచించింది. ఆర్థిక సంవ‌త్స‌రాన్ని జ‌న‌వ‌రి నుంచి డిసెంబ‌ర్‌కు మార్చే యోచ‌న‌లో ఉంటే అన్ని కోణాల్లో ఆలోచించి ముంద‌డుగు వేయాల‌ని సూచించింది. దీని మేర‌కు బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టే తేదీని ముందుకు జ‌ర‌పాల‌ని ఆర్థిక వ్య‌వ‌హారాల స్థాయీ సంఘం పేర్కొంది. సో త్వరలోనే మనకూ క్యాటెండర్ ఇయర్ తో పాటు ఫైనాన్షియల్ ఇయర్ రెండూ ఒకేసారి రానున్నాయన్న మాట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles