వీధి కుక్కల సాయం.. మర్డర్ మిస్టరీ గంటల్లో తేలిపోయింది | Stray dogs help nab man who killed wife.

Street dogs help delhi police crack murder case

Delhi Man Kills Wife, Delhi police Street Dogs, Delhi Stray Dogs, Stray Dogs Murder Case, Stray Dogs Murder Mystery, Delhi Murder Mystery, Street Dogs Chase, Delhi man Kills Wife

Delhi Man Dumps Murdered Wife's Body After Street Dogs Chase Him, Gets Arrested.

వీధి కుక్కలు మొరిగాయి.. దొరికిపోయాడు

Posted: 03/18/2017 09:42 AM IST
Street dogs help delhi police crack murder case

దక్షిణ ఢిల్లీలోని సంగం విహార్ లో ఓ మర్డర్ కేసును కేవలం 8 గంటల్లోనే ఛేదించారు పోలీసులు. ఇంతకీ కేసు మిస్టరీ వీడిపోవటానికి కారణం ఏంటో తెలుసా? వీధి కుక్కలు. అవును... అవే నిందితుడు దొరికిపోవటానికి కారణం అయ్యాయి.

భార్య నర్గీస్ పై అనుమానం పెంచుకున్న 36 ఏళ్ల మహ్మద్ అనీస్ అనే వ్యక్తి కిరాతకంగా ఆమెను పొడిచి చంపాడు. ఆపై మృతదేహాన్ని దూరంగా ఉన్న అటవీ ప్రాంతంలో పడేయాలని ఫ్లాన్ వేశాడు. అర్థరాత్రి దాటాక శవాన్ని ఓ బ్యాగ్ లో తీసుకుని సైలెంట్ గా వెళ్తున్నాడు. అయితే అపార్ట్ మెంట్ బయట ఉన్న వీధి కుక్కలు ఒక్కసారిగా మొరగటం ప్రారంభించాయి. దీంతో బ్యాగ్ దగ్గర్లోని చెత్త కుప్పలో పడేసి తిరిగి ఫ్లాట్ కు వచ్చేశాడు.

ఉదయం మృతదేహాన్ని గమనించి, అది నర్గీస్ గా గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారొచ్చి అనీస్ ను విచారించగా వీధి కుక్కలు మొరగటంతో దొరికిపోతానేమోనన్న భయంతో అక్కడే పడేసి పారిపోయానని నేరాన్ని అంగీకరించాడు. వీధి కుక్కలు గనుక అడ్డుకోకపోయి ఉంటే అనీస్ దేహాన్ని అటవీలో పడేసే వాడని, ఆపై కేసు కష్టతరంగా మారి ఉండేదన్న అభిప్రాయాన్ని ఓ అధికారి వ్యక్తం చేశాడు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Delhi  Murder Case  Stray Dogs  

Other Articles