డిగ్గీరాజా ‘లేట్’.. బంగారం లాంటి గోవా మిస్సయ్యింది.. హౌ? | How Digvijaya Singh turned Congress into a laughing stock in Goa.

How digvijay singh reason for goa fiasco

Goa Congress, PCC Chief Luizinho Falerio, Goa Fisaco, Digvijay Singh Late Reaction, How Congress Miss Goa, Goa BJP MLAs, Goa Independent MLAs Cheat

Goa PCC chief Luizinho Falerio alleges that Digvijay Singh and Venu Gopal reason for Goa Fisaco.

ఆ పెద్దాయనే కాంగ్రెస్ కొంప ముంచాడు

Posted: 03/18/2017 08:58 AM IST
How digvijay singh reason for goa fiasco

గోవా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(జీపీసీసీ) అధ్యక్షుడు లుయిజినో ఫలీరో శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ దిగ్విజయ్ సింగ్‌, గోవా స్క్రీనింగ్ కమిటీ చీఫ్ కేసీ వేణుగోపాల్‌ ఆలసత్వం మూలంగానే గోవాలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు అవకాశం కోల్పోయామని ఆయన ఆరోపించాడు. మరోపక్క ముఖ్యమంత్రి పదవి కోసం కాంగ్రెస్‌లో రచ్చకెక్కిన విభేదాల కారణంగానే ఈ పరిణామాలు జరిగాయాని చెప్పటం విశేషం.

గోవా ఫార్వర్డ్ నేత విజయ్ సర్దేశాయ్, మరో స్వతంత్ర్య ఎమ్మెల్యే రోహన్ కౌంటే తమకు దారుణంగా మోసం చేశారని చెప్పుకొచ్చాడు. ఎన్నికలకు ముందే వారు బీజేపీతో లోపాయికారి ఒప్పందం చేసుకున్నారని ఆరోపించాడు. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన ఎమ్మెల్యే మద్ధతు కూడగట్టుకున్నాం. ఈ దశలో సీఎం ఎవరన్నదానిపై వివాదం రాజుకుంది. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ తో ఫోన్ లో మాట్లాడాక ఒకానోక దశలో తాను సీఎం పదవి త్యాగానికి సిద్ధమయ్యాను కూడా.

ఇక గవర్నర్ ఆహ్వానం కోసం ఎదురుచూద్దామని దిగ్విజయ్ సింగత్ తనతో చెప్పారని, అందుకే వేచి చూడాల్సి వచ్చిందన్నారు. ఫలితాలు వచ్చిన రోజు రాత్రి కూడా పోర్వోరిమ్ ఎమ్మెల్యే రోహన్ ఖాంటే, బెనాలిమ్ ఎన్సీపీ ఎమ్మెల్యే చర్చిల్ అలేమావో సహా మరో ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించారని, దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మద్దతు లభించిందని లుయిజినో వివరించారు. అయితే వారి నుంచి సంతకాలు తీసుకోకపోవటం, ఈలోగా బీజేపీ చేయాల్సిన కార్యక్రమాన్ని పూర్తి చేసిందన్నారు. ఈ విషయంలో తాను ఎవరినీ
వేలెత్తి చూపాలని అనుకోవడం లేదని లుయిజినో పేర్కొనటం విశేషం.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Goa  Congress  Digvijay Singh  

Other Articles