విరాట్ సేన ఎదుట 452 పరుగులు లక్ష్యం.. Visitors All Out For 451

India vs australia 3rd test day 2 ranchi visitors all out for 451

india, australia, steve smith, glenn maxwell, virat kohli, ravindra jadeja, jsca international stadium complex, ranchi stadium, ranchi test, australia vs india, india vs australia, australia tour of india 2017, cricket, live score, live cricket score, cricket news

The visitors were bowled out for 451 after a brilliant effort with the ball in hand from Ravindra Jadeja who picked up his eighth five-for for the hosts.

విరాట్ సేన ఎదుట 452 పరుగులు లక్ష్యం..

Posted: 03/17/2017 01:23 PM IST
India vs australia 3rd test day 2 ranchi visitors all out for 451

రాంచీ వేదికగా జేఎస్సీఏ స్టేడియంలో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచు తొలి ఇన్నింగ్స్ లో రెండో రోజు లంచ్ విరామం తరువాత అస్ట్రేలియా అలౌట్ అయ్యింది. దీంతో విరాట్ సేన ఎదుట 451 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. అసీస్ జట్టులో కెప్టెన్ స్టీవ్ స్మిత్, జ్లెన్ మాక్స్ వెల్ మినహా ఎవరూ అంతగా రాణించలేదు. అయినా అసీస్ భారీ స్కోరును అతిథ్య జట్టు ముందు ఉంచగలిగింది. ముఖ్యంగా అసీస్ కెప్టెన్ స్మిత్ 178 పరుగలతో అజేయంగా రాణించి కెప్టెన్ ఇన్నింగ్స్ అడాడు.

నాలుగు వికెట్ల నష్టానికి 299 పరుగల ఓవర్ నైట్ స్కోరుతో ఇవాళ్టి అటను ప్రారంభించిన అసీస్ భారీ స్కోరుకు కెప్టెన్ స్మిత్.. మాక్స్ వెల్ మధ్య ఏర్పడిన చక్కని భాగస్వామ్యమే కీలకంగా మారింది. దీంతో 2103లో భారత్ తో జరిగిన టెస్టు మ్యచ్ లోనే టెస్టు క్రికెట్ లోకి అరంగ్రేటం చేసిన అసీస్ బ్యాట్స్ మెన్ జ్లన్ మాక్స్ వెల్ తన టెస్టు క్రికెట్ కెరీర్‌లో తొలి శతకం నమోదు చేశాడు. అనంతరం నాలుగు పరుగులు జోడించిన మ్యాక్స్‌వెల్‌ను 104 పరుగల వద్ద జడేజా పెవిలియన్‌కు పంపాడంతో భారీ దిశగా సాగుతున్న అసీస్ స్కోరుబోర్డుకు బ్రేక్ పడింది. ఫలితంగా 191 పరుగుల వద్ద ఈ బాగస్వామ్యానికి తెరపడింది.

ఆసీస్ బ్యాట్స్‌మెన్‌ల‌లో రెన్షా 44, వార్నర్‌ 19, మార్ష్‌ 2, హెచ్‌.కాంబ్ 19, వాడే 37, క‌మ్మిన్స్ 0, ఓకీఫ్ 25, లియాన్ 1, హెచ్‌.వుడ్ 0 ప‌రుగులు చేసి అవుట్ కాగా కెప్టెన్ స్మిత్ మాత్రం 178 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. భారత బౌలర్లలో రవీంద్ర జెడేజా మరోమారు ఐదు వికెట్లను పడగోట్టాడు. భార‌త బౌల‌ర్లలో జ‌డేజా 5, ఉమేశ్ యాద‌వ్ 3, అశ్విన్ 1 వికెట్లు తీశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles