మైనర్ దళిత బాలికలపై తండ్రి ఎదుటే గ్యాంగ్ రేప్.. dalit minor girls gangraped in front of father

5 arrested for gang rape of 2 minor girls in front of father

gang-rape, minor girls, revenge, sisters, abduction and rape, Sisters gangraped, Dahod District, Teenage Girls Rape, Bhutpagla village, Gujarat, crime

Two teen sisters, the older barely 15, were allegedly gang-raped in a moving car by six men in front of their father in Gujarat's Dahod,

గుజరాత్ లో దారుణం.. కన్నతండ్రి ఎదుటే కూతుళ్లపై గ్యాంగ్ రేప్..

Posted: 03/17/2017 02:41 PM IST
5 arrested for gang rape of 2 minor girls in front of father

దేశంలో అడపడచులపై అత్యాచారాలు జరుగుతున్న క్రమంలో పలువురు రాజకీయ నేతలు, కులు సంఘాలు తెరపైకి వచ్చి.. ఆడది ఒంటరిగా బయటకు వెళ్లాల్సిన పనేంటి.. అలాంటి పనే వుంటే తమ భర్తనో లేక తండ్రినో వెంట తీసుకువెళ్లాలని ఉచిత సలహాలు, తీర్మాణాలు ఇచ్చిన వారు కళ్లు తెరుచి, చెవులు చాచి వినాల్సిన దారుణ ఘటన గుజరాత్ రాష్ట్రంలో జరిగింది. తన తండ్రితో పాటు వెళ్తున్న ఇద్దరు కూతుళ్లపై ఆయన ఎదుట కదులుతున్న కారులోనే పైశాచిక మృగాలు దారుణానికి ఒడిగట్టాయి. ఒకరి తరువాత ఒకరు.. ఒకరిని తరువాత మరోకరిపై కామవాంఛను తీర్చుకున్నాయి.

సభ్య సమాజం తలదించుకునే విధంగా ఇలాంటి ఘటనల్లో ఎందరో మగమృగాళ్లను కటకటాల పాటు చేసినా.. మార్పు రావడం లేదు. అబలల పట్ల మగవాడి ప్రవర్తనలో మార్పు వస్తే కానీ ఇలాంటి నేరాలకు చెక్ పడదు. తన ఇద్దరు కూతళ్లను తన ఎదుటే అత్యాచారం చేస్తుంటే ఆ కన్న తండ్రి గుండె ఎంతలా అవిసిపోయిందో.. మైనర్ బాలికలపై మగమృగాళ్లు పైశాచికత్వంలో తెగబడితే.. అ చిన్నారుల ఎంతగా అంగలార్చారో.. ఎవరికి మాత్రం అర్థమయ్యేను. అహ్మదాబాద్ లోని భూత్ పాగ్లా గ్రామానికి చెందిన ఇద్దరు బాలికలు తమ తండ్రితో వెళ్తుండగా, వారిని కిడ్నాప్ చేసి మరీ ఈ దారుణానికి దుండగులు ఒడిగట్టారు.

ఆ తరువాత వీరిని మాందవ్ గ్రామ శివార్లలో వదలివేశారు. పోలీసులను అశ్రయించినా.. తమపై పిర్యాదు చేసినా హతమారుస్తామంటూ హెచ్చరికలు మచేసి మరీ పారిపోయారు. స్థానికుల సాయంతో బాధితులు పోలీసులను అశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి.. మరో నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అక్రమ మద్యం కేసులో నిందితులపై బాలికల తండ్రి కేసు నెట్టినందుకు ప్రతిగానే ఈ అత్యాచారాలకు ఒడిగట్టినట్లు కుమత్ బారియా అనే నిందితుడు చెప్పడం గమనార్హం.

ఉత్తర్ ప్రదేశ్ లో అబలలకు రక్షణ లేకుండా పోయిందని చెప్పి అధికారాన్ని చేజిక్కించుకున్న బీజేపి .. స్వయంగా ప్రధానమంత్రి సొంత రాష్ట్రంలో ఇలాంటి దారుణాలు జరుగుతుంటే ఏం చేస్తున్నారు..? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఢిల్లీలో అబలలపై అత్యాచారాలు పెరిగిపోతుంటే ఏం చేస్తున్నారన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అక్రమ మార్గాల్లో డబ్బు సంపాదించడం.. దానిపై పిర్యాదు చేస్తే.. ప్రతికారచర్యలకు పూనుకోవడం చేస్తున్నా.. ప్రభుత్వాలు పోలీసులు ఏం రక్షణ కల్పిస్తున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles