దయలేని సంతానాన్ని తల్లిదండ్రులు బయటకు పంపోచ్చు.. Delhi HC ruling, parents can evict abusive children

Delhi hc ruling on abusive children parents can evict them

Delhi, Delhi High Court, parents, Law for senior citizens, MWPSCA, children, adult children, dependents, delhi hc sensation ruling

The Delhi High Court has ruled that parents can evict their adult children from their house if they abuse them, even if the house need not be self-acquired or owned by parents.

దయలేని సంతానాన్ని తల్లిదండ్రులు బయటకు పంపోచ్చు..

Posted: 03/17/2017 11:40 AM IST
Delhi hc ruling on abusive children parents can evict them

తల్లిదండ్రుల యందు దయలేని పుత్రులు పుట్టనేమి వారు గిట్టనేమి.. పుట్టలోని చెదలు పుట్టదా..? గిట్టదా..? అంటూ వేమన రాసిన శతకంలోని పద్యాన్ని అక్షరాల నిజం చేస్తూ సంచలనాత్మకమైన తీర్పును వెలువరించింది ఢిల్లీ హైకోర్టు. పిల్లలు వారి కన్న తల్లిదండ్రుల పట్ల అమర్యాదగా వ్వవహరిస్తూ.. వారిని మనోవేదనకు గురిచేసేలా ఎలాంటి చర్యలకు ఉపక్రమించినా.. వారిని ర్దాక్షిణ్యంగా ఇళ్లనుంచి బయటకు గెంటేయొచ్చని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ క్రమంలో తల్లిదండ్రులు నివసిస్తున్న ఇల్లు వారి స్వార్జితమైనా, లేక వారసత్వంగా సంక్రమించినదైనా అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పింది.

తల్లిదండ్రులకు ఆ ఆస్తి మీద చట్టపరమైన హక్కు ఉన్నంతకాలం వారిపై చేయి చేసుకుని.. అవమానాల పాలు చేస్తూ.. దుర్భాషలాడే సంతానాన్ని నిరభ్యంతరంగా గెంటేయొచ్చని చెప్పింది.తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్ల జీవనం, సంక్షేమ చట్టంలో అంశాల గురించి వ్యాఖ్యానించే సందర్భంగా ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మన్ మోహన్ ఈ వ్యాఖ్యలు చేశారు. తల్లిదండ్రులను బౌతిక దాడులకు పాల్పడటం, మనోవేదనకు గురిచేసే పిల్లలను తప్పనిసరిగా ఇంట్లో ఉంచుకోవాల్సిన అవసరం సీనియర్ సిటిజన్లకు లేదని ఆయన తెలిపారు.

ఈ మేరకు చట్టంలోని సెక్షన్ 32కు కావల్సిన సవరణలు చేయాలని ఢిల్లీ ప్రభుత్వానికి కోర్టు సూచించింది. కొడుకులకు పెళ్లి అయినా, అవ్వకపోయినా తల్లిదండ్రులు సొంతంగా కష్టపడి సంపాదించుకున్న ఇంట్లో ఉండేందుకు కొడుకులు, కూతుళ్లకు ఎలాంటి చట్టపరమైన హక్కు ఉండబోదని జస్టిస్ మన్ మోహన్ అన్నారు. తల్లిదండ్రులకు, పిల్లలకు మధ్య సంబంధాలు బాగున్నంత కాలం వాళ్ల ఇష్టం మేరకు కావాలంటే ఇంట్లో ఉండొచ్చని, అంతేతప్ప వాళ్లకు భారంగా ఉంటామంటే మాత్రం కుదరదని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh