ఠాగూర్ చిత్ర సన్నివేశాన్ని నిజంగా రిపీట్ చేసిన వైద్యులు.. corperate hospital gives medical support to dead man

Corperate hospital gives medical support to dead man

dead man, nagabhushna rao, citizen hospital, tagore incident, cheating, nizambad, corperate hospital, hospital cheating

yet in an another drastic incident, corperate hospital doctors gives medical support to dead man and collects Rs 6.5 lakhs from his family members

మరణించిన వ్యక్తికి వైద్యం.. రూ.6.5 లక్షలు వసూళ్లు..

Posted: 03/17/2017 12:15 PM IST
Corperate hospital gives medical support to dead man

వైద్యో నారాయణో హరి అంటూ.. వైద్యులను నర నారాయణలుగా పేర్కోంటూ సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు వారిని గౌరవిస్తుంటే.. వారు మాత్రం ధన మూలమ్ ఇదం జగత్ అంటూ కేవలం డబ్బు కోసం ఎంతటి నీచానికైనా దిగజారుతున్నారు. ఇలా చెప్పడానికి గతంలో అనేక కార్పోరేట్ అస్పత్రుల్లో అనేక ఘటనలు సజీవ సాక్షంగా మారగా, తాజాగా శేరిలింగంపల్లిలోని సిటిజన్ అస్పత్రిలోనూ అలాంటి ఘటనే వెలుగుచూసింది. కోట్ల ఖర్చుపెట్టి తాము వైద్యం నేర్చుకుంది.. పేషంట్ల ప్రాణాలను కాపాడటానికి కాదని, వారి డబ్బును లాగేందుకే అన్న రీతిలో వైద్యులు వ్యవహరిస్తున్నారు.

నిజామాబాద్ జిల్లాకు చెందని నాగభూషణ్ రావు అనారోగ్యం సమస్యలతో శేరిలింగంపల్లిలోని సిటిజన్ అస్పత్రిలో చేరారు. అయన చికిత్స పోందుతూ చనిపోయినా తరువాత కూడా ఆ విషయాన్ని తమ వద్ద దాచిన వైద్యులు ఆయన పరిస్థితి బాగోలేదని, మరో 27 గంటలపాటు వైద్యం అందిస్తే కానీ ఏమీ చెప్పలేమని చెప్పారని కుటుంబసభ్యులు అరోపిస్తున్నారు. ఈ తరుణంలో రెండు విడతలుగా తమ వద్ద నుంచి ారున్నర లక్షల రూపాయల బిల్లును వసూలు చేసి ఆ తరువాత నాగభూషణ్ రావు మరణించాడని చెప్పారని అరోపిస్తున్నారు. వైద్యుల ధనదాహం వల్లే నాగభూషణ్ రావు మరణించాడని అస్పత్రి ఎదుట ధర్నాకు దిగారు.

గత ఏఢాది కేవలం మూడించుల ఎత్తు పెరగడానికి నగరంలోని గ్లోబల్ అస్పత్రి వైద్యలు నితిన్ రెడ్డి అనే సాప్టువేర్ ఇంజనీరుకు రెండు కాళ్లుకు సర్జరీ చేసి లక్షల రూపాయలను వసూళు చేసిన ఘటనను ఇంకా  నగరవాసులు మర్చిపోక ముందే మరోటి ఇలాంటి మోసమే వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది. ఇక కార్పోరేట్ అస్పతులు మాత్రం తాము కోట్ల రూపాయలతో అస్పత్రులు కట్టింది వ్యాపారధోరణితోనే అన్న అర్థం వచ్చేలా.. వ్యవహరిస్తున్నారు. ఒక్కో డాక్టర్ తన కోర్సును పూర్తి చేయడానికి ప్రభుత్వం వారిపై ప్రజాధనాన్ని ఖర్చు చేస్తుందని.. ఈ నేపథ్యంలో తాము మానవత్వంలో వ్యవహరించాలన్న ఇంకితాన్ని మర్చిపోతున్నారు. తమను దేవుళ్లుగా పరిగణిస్తూ.. కొలుస్తున్న ప్రజల వైద్యులు భక్తులుగా కాకపోయినా.. కనీసం మనుషుల్లా వైద్యం అందిస్తే చాలునని పేషంట్ల బంధువులు కోరుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles