ఫైర్ యాక్సిడెంట్.. కెప్టెన్ కూల్ కి కాస్తలో తప్పిన డేంజర్ | Fire breaks out at hotel where Dhoni and team were staying.

Ms dhoni rescued safely from hotel fire in delhi

MS Dhoni, Dwaraka Hotel Fire Accident, Vijay Hazare Semi Final, Dhoni Fire Accident, MS Dhoni Escape, Dhoni and Jarkhand Team Members, Jarkhand versus Bengal Semi Final, Dhoni Jarkhand Captain

MS Dhoni Has Narrow Escape As He Is Rescued From A Fire At His Hotel In Dwarka. Dhoni and other Jharkhand players evacuated after fire breaks out. Jharkhand-Bengal Vijay Hazare semi postponed

అగ్ని ప్రమాదం... ధోనీకి తృటిలో తప్పిన ముప్పు

Posted: 03/17/2017 10:12 AM IST
Ms dhoni rescued safely from hotel fire in delhi

టీమిండియా మాజీ సారథి, జార్ఖండ్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మరియు ఆయన టీం సభ్యులు ఘోర ప్రమాదం నుంచి బయటపడ్డారు. శుక్రవారం ఉదయం జార్ఖండ్ టీం సభ్యులు బస చేసిన హోటల్ లో అగ్ని ప్రమాదం సంభవించగా, ఫైర్ సిబ్బంది వారిని కాపాడగలిగారు.

విజయ హజరే ట్రోఫీలో భాగంగా ఢిల్లీలోని సెక్టార్ 10 ప్రాంతంలో ఉన్న ద్వారకా హోటల్ లో టీం బస చేసింది. ఈ ఉదయం 6.30 నిమిషాల సమయంలో ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఢిల్లీ ఫైర్ సర్వీస్ సిబ్బంది హుటాహుటిన బయలుదేరి మంటలను ఆర్పేశారు. ప్రమాదం గురించి తెలియగానే ధోనీ అండ్ టీంను సురక్షితంగా బయటకు చేరవేశారు. సుమారు 7.50 నిమిషాల ప్రాంతలో మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చినట్లు సమచారం. ప్రమాదానికి గల కారణాలను అధికారులు అన్వేషిస్తున్నారు.

 

కాగా, టీం సభ్యుల కిట్ లు పూర్తిగా కాలిపోవటంతో సెమీ ఫైనల్ మ్యాచ్ ను రద్దు చేసి శనివారంకు వాయిదా వేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సెమీస్ లో బెంగాల్ తో జార్ఖండ్ తలపడనుంది.  జూన్ లో ఛాంపియన్స్ ట్రోపీలో రాణిస్తేనే ధోనీకి వన్డేలో ఆటగాడిగా చోటు పదిలం అవుతుంది. ఈ నేపథ్యంలో 35 ఏళ్ల ధోనీ విజయ్ హజారే ట్రోఫీని ఛాలెంజింగ్ గా భావిస్తున్నాడు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : MS Dhoni  Fire Accident  Swaraka Hotel  Vijay Hazare Trophy  

Other Articles