ఉద్యోగాలలో వారసత్వాలా..? మరి నిరుద్యోగుల మాటేంటి..? set back to telangana government in high court

Set back to telangana government in high court

Telangana, telangana government, high court, singareni, Dependent Employees, employment, unemployed youth, new notification, recruitment, kcr

Another set back to telangana government in high court, the apex court orders to issue new notification and start recruitment instead of allocating employees dependents

ఉద్యోగాలలో వారసత్వాలా..? మరి నిరుద్యోగుల మాటేంటి..?

Posted: 03/16/2017 12:46 PM IST
Set back to telangana government in high court

తెలంగాణ ప్రభుత్వానికి రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టులో చుక్కెదురైంది. సింగరేణి పరిశ్రమలో ఉద్యోగస్థులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన వారసత్వ ఉద్యోగ నియామకాలపై న్యాయస్థానం అగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు వారసత్వ ఉద్యోగాలకు వ్యతిరేకంగా పలువురు నిరుద్యోగులు న్యాయ పోరాటానికి దిగారు. వారసత్వ ఉద్యోగాల నియామకాలను సవాల్‌ చేస్తూ గోదావరిఖనికి చెందిన సతీష్‌ కుమార్‌ అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించాడు.  

30వేల వారసత్వ ఉద్యోగాల వల్ల తమకు ఉద్యోగ అవకాశాలు రావంటూ అతడు తన పిటిషన్ లో పేర్కొన్నాడు. ప్రభుత్వ నిర్ణయం వల్ల నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందని ఫిర్యాదులో తెలిపారు. వారు దాఖలు చేసిన పిటీషన్ ను విచారించిన న్యాయస్థానం ఉద్యోగస్థుల వారసులకే ఉద్యోగాలను ఇవ్వడమేంటని తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇలా ఉద్యోగాలను ఉద్యోగుల పిల్లలకే కేటాయిస్తే.. మరి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎలా వస్తాయని ప్రశ్నించింది.

తక్షణం వారసత్వ ఉద్యోగాల నియామకాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించాలని న్యాయస్థానం అదేశించింది. అంతేకాదు.. త్వరలోనే కొత్త నోటిఫికేషన్ ను విడుదల చేసిన అర్హులైన నిరుద్యోగ యువతకు అవకాశాలు కల్పించాలని కూడా హైకోర్టు అదేశించింది. అయితే అనారోగ్యం చేత విధులకు హాజరుకావడంలో ఇబ్బందులను ఎదుర్కోని అన్ ఫిట్ గా తేలిన ఉద్యోగులను తొలగించి వారి వారసులకు మాత్రం ఉద్యోగావకాశాలను కల్పించవచ్చని న్యాయస్థానం అదేశించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles