కాంగ్రెస్ కు షాక్.. విశ్వజీత్ రాణే రాజీనామా Rebel MLA Vishwajit Rane resigns Congress

Rebel congress mla vishwajit rane resigns says party responsible for destroying mandate in state

congress mla, Vishwajit Rane, resign, Goa Floor Test, Manohar Parrikar, Goa Chief Minister, Goa floor test, Goa Assembly, Goa government, Divvijay singh, Bharatiya Janata Party, Congress

Rebel Congress MLA Vishwajit Rane has resigned immediately after Manohar Parrikar proved his majority in the state assembly.

కాంగ్రెస్ కు షాక్.. విశ్వజీత్ రాణే రాజీనామా

Posted: 03/16/2017 03:08 PM IST
Rebel congress mla vishwajit rane resigns says party responsible for destroying mandate in state

గోవా ముఖ్యమంత్రి పీఠాన్ని ఎలాగైనా అధిరోహించాలని తాను గత ఐదేళ్లుగా పడిన శ్రమను కాంగ్రెస్ అధిష్టానం నిర్వీర్యం చేయడంలో.. కలత చెందిన సీనియర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే విశ్వజీత్ రాణే ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. సరిగ్గా మనోహర్‌ పారికర్‌ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం బలపరీక్షలో విజయం సాధించిన తరువాత ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మనోహర్ పారికర్ ప్రభుత్వం బలపరీక్షకు సన్నధమైన నేపథ్యంలో ఓటు హక్కును వినియోగించుకునేందుకు కూడా విముకత వ్యక్తం చేసిన ఆయన అసెంబ్లీకి కూడా గైర్హజరయ్యారు.

కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీరుపై ఆది నుంచి గుర్రుగా వున్న రాణే.. ఇవాళ రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. గోవాలో బీజేపి కన్నా మెజార్టీ స్థానాలు సాధించినప్పటికీ అధిష్టానం దూతగా అక్కడికి వచ్చిన ఏఐసిసి ప్రధానకార్యదర్శి దిగ్విజయ్ సింగ్ ఇతర పార్టీల మద్దతును తీసుకునేందుకు కాలయాపన చేశారని, ఈ తరుణంలో కేంద్రమంత్రి నితిన్ గడ్కారీ.. రంగంలోకి దిగి బీజేపికి అనుకూలంగా పావులు కదపడంలో సక్సెస్ సాధించాడని, కాంగ్రెస్ అధిష్టానంపై ఆయన బహిరంగానే విమర్శలు సంధించారు.

దీంతోనే ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని, గత ఐదేళ్లగా తాము చేసిన పోరాటాలు, పార్టీ గెలిచేందుకు చేసిన కృషి అంతా అధిష్టానం అలసత్వంతో నీరుగారిపోయిందన్నారు. ఏకంగా ఆయన దిగ్విజయ్ సింగ్ ను టార్గెట్ చేస్తూ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఇవాళ మనోహర్ పారికర్ ప్రభుత్వం బలాన్ని నిరూపించుకున్న తరుణంలో ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. కాగా అయన త్వరలో కమలం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : congress mla  Vishwajit Rane  resign  Goa Floor Test  Manohar Parrikar  BJP  congress  

Other Articles

Today on Telugu Wishesh