గోవాపై మళ్లీ కమల వికాసం.. విశ్వాసం నెగ్గిన పారికర్ Parrikar wins trust vote, gets support of 22 MLAs

Chief minister manohar parrikar wins trust vote gets support of 22 mlas

Goa Floor Test LIVE, Manohar Parrikar, Goa Chief Minister, Goa floor test, Goa Assembly, Goa government, Bharatiya Janata Party, Congress

Manohar Parrikar-led BJP government has claimed support of 22 MLAs, two more than the halfway mark of 20 in the 40-member Assembly.

గోవాపై మళ్లీ కమల వికాసం.. విశ్వాసం నెగ్గిన పారికర్

Posted: 03/16/2017 11:57 AM IST
Chief minister manohar parrikar wins trust vote gets support of 22 mlas

గోవాలో ముఖ్యమంత్రి మనోహర్‌ పారికర్‌ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం బలపరీక్షలో విజయం సాధించింది. దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అదేశాల మేరకు కేవలం 48 గంటల వ్యవధిలో అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకునేందుకు సిద్దమైన పారికర్ ప్రభుత్వం.. గోవా ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో బలాన్ని నిరూపించుకుంది. ఇటీవల గోవా అసంబ్లీకి జరిగిన ఎన్నికలలో అతిపెద్ద పార్టీగా అవతరించిన తమను కాదని బీజేపిని గవర్నర్ ఫ్రభుత్వ ఏర్పాటుకు పిలవడంలపై కాంగ్రెస్.. న్యాయస్థానాన్ని అశ్రయించిన విషయం తెలిసిందే.

అయితే ఉన్నఫలంగా బీజేపి బలాన్ని నిరూపించుకోవాలన్న కాంగ్రెస్ అభ్యర్థనను మన్నించిన న్యాయస్థానం పారికర్ ప్రభుత్వం 48 గంటల వ్యవధిలో బలనిరూపణ చేయాలని అదేశించింది. న్యాయస్థానం అదేశానుసారం పారికర్ ప్రభుత్వం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలను నిర్వహించి.. బలపరీక్షలో మెజారిటీని నిరూపించుకుంది. మ్యాజిక్ ఫిగర్ 20కి బదులుగా మనోహర్‌ ప్రభుత్వం 22 మంది శాసనసభ్యులతో తన బలాన్ని నిరూపించుకోగలిగింది. పారికర్ ప్రభుత్వానికి అనుకూలంగా 22 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 16 ఓట్లు పడ్డాయి. దీంతో గోవా అసెంబ్లీపై మళ్లి కమలం వికసించినట్లైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh