జడ్జి కండిషన్ : బెయిల్ కోసం వెళ్లితే ఆ పని చేయాల్సిందేనంట! | Want bail judge variety condition for petitioner.

Sensational judgement by ariyalur district sessions court

Tamil Nadu karuvelam trees, Judge A K A Rahman, Bail Variety Condition, Not Caveat uproot Seemai Karuvelam, Seemai Karuvelam Trees, Ariyalur District Sessions Court , Anticipatory Bail Seemai Karuvelam Trees

Accused directed to remove karuvelam trees for bail in Tamil Nadu Judge A K A Rahman of the Ariyalur District Sessions Court on Wednesday granted anticipatory bail to a petitioner, but not without a caveat — he should in turn uproot 100 seemai karuvelam (Prosopis juliflora) trees in his village within 20 days.

బెయిల్ కోసం అంత పని చేయాల్సిందే!

Posted: 03/16/2017 08:34 AM IST
Sensational judgement by ariyalur district sessions court

బెయిల్ కావాలంటే ఎవరైనా ఏం చేస్తారు? జడ్జి చెప్పినట్లు పూచీ కత్తులపై జామీను పొంది బయటికి వస్తారు. కానీ, తమిళనాడులో మాత్రం ఓ జడ్జి బెయిల్ కోసం విచిత్రమైన కండిషన్ పెట్టడం ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది. షూరిటీ కింద డబ్బు కాకుండా వంద చెట్లను నరకాలంటూ ఆదేశించటంపై అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పైగా 20 రోజుల్లో ఆ పని పూర్తి చేసి గ్రామాధికారులకు ఫోటోలతో సాక్ష్యాలు సమర్పించాలని న్యాయమూర్తి ఆదేశించాడు కూడా.

అరియలూరు జిల్లా సెషన్స్ కోర్టులో తన దగ్గరికి తీర్పు కోసం వచ్చిన ఓ కేసులో మేజిస్ట్రేట్ ఏకేఏ రెహమాన్ ఈ వినూత్న తీర్పు ఇచ్చారు. ఓ క్రిమినల్ కేసులో ముందస్తు బెయిల్ కోసం వచ్చిన వ్యక్తిని డబ్బుగా కాకుండా వంద తుమ్మ చెట్లను నరకాలని ఆయన ఆదేశించారు. మారువథుర్ కు చెందిన కే రాజేంద్రన్ పై ఆనబరసి అనే వ్యక్తి కూవగం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. దీంతో రాజేంద్రన్ పై క్రిమినల్ కేసు నమోదయ్యింది.

అరెస్ట్ కు భయపడి అతగాడు ముందుగానే బెయిల్ కు దరఖాస్తు చేయగా, జడ్జి రెహమాన్ ఈ తీర్పు ఇచ్చారు. రాష్ట్రంలో తుమ్మచెట్లు విచ్చలవిడిగా పెరిగిపోయి పర్యావరణానికి చేటు చేస్తున్నాయి. వాటి కారణంగా భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. ఫలితంగా గాలిలో తేమ కూడా బాగా తగ్గిపోతోంది. ఈ విషయమై కోర్టుల్లో పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. అందుకే ఇలాంటి శిక్ష విధించాను అని ఆయన వ్యాఖ్యానించాడు.

కాగా, సీమై కరువెలం(తుమ్మచెట్లు) సమస్యపై స్పందించిన మద్రాస్, మధురై హైకోర్టు బెంచ్‌లు భూగర్భ జలాల పరిరక్షణ కోసం తుమ్మచెట్లను తొలగించేందుకు సత్వర చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించాయి కూడా. ప్రజల్లో అవగాహన కల్పించేలా ఉన్న ఈ తీర్పును పర్యావరణ ప్రేమికులు కూడా స్వాగతిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tamil Nadu  Seemai Karuvelam Trees  Ariyalur District  Bail Condition  

Other Articles