మన విషయంలో మాత్రం ట్రంప్ తగ్గాడండోయ్ | USCIS will accept H-1B petitions for fiscal year 2018.

Uscis to accept h 1b applications from april 3

US Citizenship and Immigration Services, USCIS, H-1B Visa Petitions, H-1B Cap Cases, H-1B Visa Indians, H-1B, April 3rd Accept, Accept H-1B Petitions

US Citizenship and Immigration Services(USCIS) will accept H-1B petitions for fiscal year 2018 beginning April 3.

హెచ్-‌1బీ అఫ్లికేషన్లకు లైన్ క్లియర్

Posted: 03/16/2017 08:11 AM IST
Uscis to accept h 1b applications from april 3

భారత ఐటీ నిపుణులు, కంపెనీలకు ఊరట కలిగించే నిర్ణయాన్ని అమెరికా తీసుకుంది. హెచ్ 1బీ వర్క్ వీసా దరఖాస్తులను వచ్చేనెల 3వ తేదీ నుంచి స్వీకరించనున్నట్టు అమెరికా పౌరసత్వ, ఇమ్మిగ్రేషన్ సర్వీసుల సంస్థ (యూఎస్‌సీఐఎస్) తెలిపింది. అయితే ఎప్పటి వరకు స్వీకరిస్తారన్న విషయాన్ని మాత్రం పేర్కొనలేదు. సాధారణంగా ఐదు పనిదినాలపాటు దరఖాస్తులను స్వీకరిస్తారు.

గతంలో ఈ విషయాన్ని యూఎస్‌సీఐఎస్‌ స్పష్టంగా పేర్కొనేది. ప్రస్తుతం మాత్రం గడువు విషయాన్ని ప్రస్తావించలేదు. అక్టోబరు 1తో మొదలయ్యే 2018 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ దరఖాస్తులను ఆహ్వానిస్తారు. తాజా నిర్ణయంతో ఐటీ కంపెనీలు, నిపుణులకు ఇప్పటి వరకు ఉన్న ప్రతిబంధకం తొలగిపోయినట్టే. ఫాం ఐ-129 ఫీ ను 460 డాలర్లకు పెంచిన అధికారులు, 14 రోజుల గడువు విధిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

యూఎస్ సీఐఎస్ ఈ మధ్యే ప్రీమియమ్ ప్రాసెసింగ్ వీసాలపై ఏప్రిల్ 3 నుంచి ఆరు నెలల పాటు నిషేధం విధించిన విషయం తెలిసిందే. అమెరికా కాంగ్రెస్‌ విధించిన 85 వేల హెచ్‌1బీ వీసాల మంజూరుకు తగినన్ని దరఖాస్తులు గత సంవత్సరాల్లో వచ్చాయి. వీటిలో 65 వేలు జనరల్‌ కేటగిరీ వారికి, 20 వేలు అమెరికా విద్యాసంస్థల్లో పీజీ లేదా ఉన్నత విద్య చదివిన విదేశీయులకు ఇవ్వాలనేది నిబంధన. రీసెర్చి విభాగంలో అక్కడికి వెళ్లేవారికి ఇచ్చే వీసాలు వీటి కిందకు రావని తెలిపింది. వీసా నిబంధనలను కఠిన తరం చేయటం తదితర పరిణామాలపై నిన్న పార్లమెంట్ లో మంత్రి నిర్మలా సీతారామన్ ఓ ప్రకటన చేసిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : H-1B Visa  2018 Fiscal Year  April 3rd Accept  

Other Articles