ప్రత్యర్థులో అశలు రేపి.. నీళ్లు చల్లిన కేసీఆర్ cm kcr gives clarity on early poll in telangana

Cm kcr gives clarity on early poll in telangana

chief minister, kcr, kalvakuntla chandra shekar rao, congress, TDP, congress, bjp, tdp, telangana, politics

Telangana chief minister kalvakuntla chandrashekar rao, who annouced that if elections are conducted now, his party will win 106 seats plays down on early polls

ప్రత్యర్థులో అశలు రేపి.. నీళ్లు చల్లిన కేసీఆర్

Posted: 03/15/2017 08:09 PM IST
Cm kcr gives clarity on early poll in telangana

తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా 106 నుంచి 110 అసెంబ్లీ స్థానాలను టీఆర్ఎస్ పార్టీ తన ఖాతాలో వేసుకుంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖర్ రావు ప్రకటంచిన నేపథ్యంలో కాంగ్రెస్ మరో ముందడుగు వేసి.. కేసీఆర్ చేయించిన సర్వే నిజమే అయితే ముందస్తు ఎన్నికలకు తాము సిద్దమంటూ ప్రకటించింది. దీంతో మళ్లీ ఢిఫెన్స్ లో పడిన కేసీఆర్.. ప్రత్యర్థుల అశలపై నీళ్లు చల్లుతూ మద్యంతర ఎన్నికలపై వస్తున్న కథనాలపై క్లారిటీ ఇచ్చారు.

ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తే లేదని, మంచిగా పనిచేస్తే ప్రజలే ఆశీర్వదిస్తారని ఆయన బుధవారం శాసనమండలిలో తెలిపారు. షెడ్యూల్‌ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని కేసీఆర్‌ వెల్లడించారు. గ్రామాల్లో నిరంతరంగా విద్యుత్‌ సరఫరా చేస్తున్నామని, కుల వృత్తులను కాపాడటమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.  బీడీ కార్మికులు, ఒంటరి మహిళలకు వెయ్యి రూపాయల భృతి ఇస్తున్నట్లు కేసీఆర్ తెలిపారు.

ఇక తెలంగాణ ఐ పాస్‌ను ప్రపంచ దేశాలు అభినందిస్తున్నాయని కేసీఆర్‌ అన్నారు. విద్యుత్‌ శాఖలో 24 వేలమంది కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేస్తామని కేసీఆర్‌ ప్రకటించారు. అలాగే తెలంగాణలో కాంట్రాక్ట్‌ ఉద్యోగి అనేది లేకుండా చూస్తామన్నారు. హోంగార్డులందరికి కానిస్టేబుల్స్‌గా పదోన్నతి కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశాల్లోనే ముస్లిం, ఎస్టీ రిజర్వేషన్‌ బిల్లు తెస్తామని కేసీఆర్‌ తెలిపారు. ఆడపిల్లల తల్లిదండ్రులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో కల్యాణలక్ష్మీ పథకానికి కేటాయింపులను రూ.75,116కి పెంచామన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chief minister  kcr  kalvakuntla chandra shekar rao  congress  TDP  congress  bjp  tdp  telangana  politics  

Other Articles

Today on Telugu Wishesh