ఆ రేపిస్ట్ మంత్రి ఎట్టకేలకు దొరికాడోచ్ | UP Rape accused ex-minister Arrested.

Gayatri prajapati arrested in lucknow

Uttar Pradesh, Uttar Pradesh Gayatri Prasad Prajapati, Gayatri Prajapati Arrest, Ex-Minister Gayatri Prajapati, Gayatri Prajapati Lucknow, Rapist Minister Arrest, Ex Minister Arrest, Absconding Gayatri Prajapati, Absconding Minister Arrest

Absconding former Uttar Pradesh Cabinet Minister Gayatri Prasad Prajapati arrested in Lucknow.

ఆ మాజీ మంత్రిని ఎట్టకేలకు అరెస్ట్ చేశారు

Posted: 03/15/2017 09:04 AM IST
Gayatri prajapati arrested in lucknow

వివాదాస్పద నేత గాయత్రి ప్రజాపతిని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. లక్నో లో కాసేపటి క్రితం అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. తల్లి కూతుళ్లను సాముహిక అత్యాచారం చేసిన కేసులో ప్రజాపతిపై ఆరోపణలు ఉన్నాయి.

అఖిలేష్ యాదవ్ హయాంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన ప్రజాపతిని ఫిబ్రవరి 27 నుంచి పరారీలో ఉన్నాడు. అరెస్ట్ చేయాలన్న డిమాండ్ బలంగా వినిపించినప్పటికీ సర్కార్ ఆ పని మాత్రం చేయలేకపోయింది. నిన్న గాయత్రి కొడుకులతోసహా ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు. మంగళవారమే ప్రజాపతిని అరెస్ట్ చేసి గౌమతపల్లి స్టేషన్ కు తరలించినట్లు తెలుస్తోంది.

కాగా, ఈ కేసులో ఉన్న మరో ఆరుగురిపై కూడా చర్యలు తీసుకోవాలని సుప్రీం ఇది వరకే ప్రభుత్వాన్ని ఆదేశించింది కూడా. ఎన్నికల ప్రచార సమయంలో ఈ రేపిస్ట్ మంత్రిని అరెస్ట్ చేయాలంటూ బలంగా గళం వినిపించిన బీజేపీ, తాము అధికారంలోకి వస్తే 24 గంటల్లో ఆ పని చేస్తామని సాక్షాత్తూ బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా నే ఓ బహిరంగ సభలో వెల్లడించాడు కూడా. అమేథీ నుంచి పోటీ చేసిన ప్రజాపతి ఓడిపోయాడు కూడా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Uttar Pradesh  Gayatri Prasad Prajapati  Arrest  

Other Articles