పైశాచికం: 14 ఏళ్ల అమ్మాయి పై వెయ్యి మంది ఒకరి తర్వాత ఒకరు... | Teen ‘sex slave’ sues motel

Forced to have sex girl suing motel

Philadelphia Motels Sex Trafficking, Girl Sue on Motel, Philadelphia Human Trafficking, sex with 1000 men, Nadeem Bezar, Thomas Kline, Emily Marks, Sexual Slavery

Motel Sued by Alleged Human Trafficking Victim Forced Into Sex Work as a Teen in Philadelphia.

స్టార్ హోటళ్లలోనే సెక్స్ రాకెట్ లు

Posted: 03/15/2017 08:42 AM IST
Forced to have sex girl suing motel

ఆడిపాడాల్సిన పసితనాన్ని తమ అవసరాల కోసం చిదిమేసే రాక్షసులు ఉన్న రోజులివి. వ్యాపారం ముసుగులో ఇలాంటి వ్యవహారాలు సర్వసాధారణంగా జరుగుతున్నా... ఊహించని రీతిలో ఓ పెద్ద సెక్స్ రాకెట్ ముఠా గుట్టు రట్టయిన ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. ఇందుకు పెద్ద పెద్ద స్టార్ హోటళ్లు వేదిక కావటమే ఇక్కడ చెప్పుకోదగింది.

ఫిలడెల్ఫియా లోని పెద్ద మోటళ్లు(హైవేలపై ఉండే పెద్ద హోటళ్లు) వ్యభిచారానికి సెంటర్ పాయింట్ గా మారాయి. 14 ఏళ్ల ఓ అమ్మాయి తప్పించుకుని వెల్లడించిన వివరాలతో ఇప్పుడు ఈ విషయం న్యాయస్థానానికి చేరింది. సెక్స్ ట్రాఫికింగ్ లో భాగంగా బాధితులను పెద్ద పెద్ద హోటళ్లకు తరలించి అక్కడ పెద్ద పెద్ద వ్యాపారవేత్తలకు, ఇంతరులకు వారితో పడక సుఖాన్ని అందిస్తుంటారంట. ఈ క్రమంలో ఒక్కోసారి వారి మరణాలు కూడా సంభవిస్తుంటాయని ఆ బాలిక వెల్లడించింది.

2014 లో ఆ బాలిక ఈశాన్య ఫిలడెల్పియాలోని రూజ్ వెల్ట్ హోటల్ నుంచి తప్పించుకుని అధికారులకు తనపై జరిగిన దాష్టీకాలను వివరించింది. సుమారు రెండేళ్లపాటు వెయ్యి మంది ఆ చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డారంట. వారిలో చాలా మంది వయసు పైబడిన వాళ్లేనని రోదిస్తూ చెప్పుకొచ్చింది. పైకి హంగులతో పెద్ద పెద్ద ఈవెంట్లకు వేదికగా కనిపించే ఆ హోటల్ ఇంత రాక్షస క్రీడకు మూలమని తెలియగానే అంతా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు హోటల్ మాత్రం తమకు ఏ మాత్రం సంబంధం లేదని చెబుతోంది. కానీ, కొందరు కస్టమర్లు మాత్రం ఆ హోటల్ అలాంటి ఘటనలను చూశామంటూ చెప్పటం కొసమెరుపు. ఇక ఈ వ్యవహారంపై అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం స్పందించింది. కేవలం ఫిలడెల్ఫియా నుంచే ఏడాదికి 8 వేల మంది యువతులను అక్రమంగా రవాణా చేస్తారని ఓ నివేదిక వెల్లడించింది. వారిలో 73 శాతం మందిని ఇలా మోటళల్లో సెక్స్ రాకెట్ లు నడిపేందుకు వాడుతున్నారన్న విషయాన్ని ధృవీకరించింది.

ప్రస్తుతం 17 ఏళ్ల వయసున్న ఆ అమ్మాయి తల్లిదండ్రులను చేరిందని, ప్రస్తుతం చికిత్స తీసుకుంటూ సాధారణ జీవితంలోకి వచ్చేందుకు యత్నిస్తోందని ఈ కేసులో ఆమె తరపు వాదనలు వినిపిస్తున్న నదీమ్ బేజర్ చెబుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Philadelphia  Hotels Motels  Sex Trafficking  

Other Articles