గోవా, మణిపూర్ లలో బీజేపి ప్రభుత్వాలే ఏర్పడనున్నాయా.? bjp party to form government in goa and manipur

Bjp party to form government in goa and manipur

Amit Shah, Assembly election, Goa , Manipur, Government, manipur election, Goa election, BJP, Congress, BJP chief, Ram madhav, manohar parikar, five state assembly elections. politics

As BJP chief Amit Shah said yesterday the his party is going to form government in four states even after congress party emerged as single largest party, bjp top brass entered into ground to make it into reality,

గోవా, మణిపూర్ లలో బీజేపి ప్రభుత్వాలే ఏర్పడనున్నాయా.?

Posted: 03/12/2017 04:38 PM IST
Bjp party to form government in goa and manipur

పంజాబ్ మినహా మిగిలిన నాలుగు రాష్ట్రాల్లోనూ బీజేపీ ప్రభుత్వాలే ఏర్పాటు చేస్తామని ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా చెప్పింది చెప్పినట్లుగానే చేస్తున్నారు. ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లలో క్లీన్ స్వీప్ చేసిన బీజేపి.. గోవా, మణిపూర్ లలో అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్ ను కాదని మిత్రులతో కలసి ప్రభుత్వాలను ఏర్పాటు చేసేందుకు చర్యలను తీసుకుంటుంది, ఫలితాలు వచ్చిన క్రమంలో వెనువెంటనే రంగంలోకి దిగిన బీజేపి పెద్దలు మిత్రపక్షాలతో పాటు స్వతంత్రులతో చర్చలు జరిపి వారి మద్దతు కూడగట్టుకునే పనిలో వున్నారు.

ఇటు గోవాలో మరట్వాడా గణపరిషత్ తో పాటు ఎంఎఫ్ పి పార్టీతో కలసి చర్చలు నిర్వహించి ఆయా పార్టీల శాసనసభ్యలను మద్దతు కూడగట్టుకోవడంలో బీజేపి పెద్దలు సఫలమయ్యారు. అయినా పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సంఖ్యా బలం సరిపోని నేపథ్యంలో రంగంలోకి దిగిన పెద్దలు అటు స్వతంత్రులను తమకు అండగా నిలబడేట్టు చేసుకోవడంలో సఫలీకృతులయ్యారని సమాచారం, కాగా మిత్రపక్షాలుగా కొనసాగి దూరమైన పార్టీలు బీజేపికి పెద్దలకు కూడా పలు షరతులు విధించాయని సమాచారం.

ఇక అటు మణిపూర్ లో కూడా మిత్రపక్షాలను దారికి తెచ్చుకుని మరో ఈశాన్య రాష్ట్రంలో తొలిసారిగా బీజేపి జెండాను రెపరెపలాడించేందుకు రంగం సిద్దమైంది. బీజేపి పాలిట్ బ్యూరో సభ్యుడు రాం మాదవ్ నేతృత్వంలో మణిపూర్ లో కూడా బీజేపి ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్దమైందని తెలుస్తుంది. మణిపూర్ లో కేవలం మూడు స్థానాలతో అధికారాన్ని తిరిగి సాధించుకోవడంలో విఫలమైన కాంగ్రెస్ పార్టీ.. అతిపెద్ద పార్టీగా అవతరించినా.. తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే దిశగా చేసిన చర్యలు ఫలించలేదు. దీంతో మణిపూర్ లోనూ కమలం ప్రభుత్వ ఏర్పాటు దిశగా సాగుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Amit Shah  Ram madhav  manohar parikar  Assembly election  goa  manipur  BJP  Congress  BJP chief  

Other Articles