అఖిలేష్ యాదవ్ పై అమర్ సింగ్ సంచలన అరోఫణలు Mulayam is soul of Samajwadi Party, saysAmar Singh

Mulayam is soul of samajwadi party congress failed to see that amar singh

Amar Singh, Samajwadi Party, leader, Uttar Pradesh, Assembly Elections, Congress, Mulayam Singh Yadav, Uttar Pradesh elections,UP elections 2017,UP polls 2017, Uttar Pradesh, BJP, Congress, Samajwadi party, bahujan samajwadi party, politics

Samajwadi Party expelled party leader Amar Singh took on dynasty politics and suggested that to survive, the party needs to look for leadership outside the family.

అఖిలేష్ యాదవ్ పై అమర్ సింగ్ సంచలన అరోఫణలు

Posted: 03/12/2017 01:34 PM IST
Mulayam is soul of samajwadi party congress failed to see that amar singh

రాజకీయం వేరు కుటుంబ తగాదాలు వేరని.. ప్రజా జీవితంలో వున్న రాజకీయ వేత్తలు కుటుంబ విషయాలను పక్కకు బెట్టి.. ఇప్పటికైనా రాజకీయాలలో నిమగ్నం కావాలని సమాజ్‌వాది పార్టీ బహిష్కృత నేత అమర్‌ సింగ్‌ సమాజ్‌వాది పార్టీ నేతలకు సూచించారు. ఎన్నికల ముందు అర్నేళ్ల నుంచి ప్రజా సమస్యలపై సమాజ్ వాదీ నేతలు దృష్టిసారించివుంటే బావుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. నాయకత్వాన్ని ఎంచుకునే విషయంలో కుటుంబం వెలుపల నుంచి ఆలోచించాల్సిన అవసరం ఉందని అన్నారు.

సమాజ్‌వాది పార్టీకి ములాయం సింగ్‌ యాదవ్‌ ఆత్మ అని చెప్పుకోచ్చిన ఆయన. ఈ  విషయాన్ని అయన కుమారుడు అఖిలేశ్‌ యాదవ్‌, కాంగ్రెస్‌ పార్టీ విస్మరించాయని విమర్శించారు. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ చేతిలో ఎస్పీ కాంగ్రెస్‌ కూటమి దారుణ ఓటమిని చవిచూసిన తరువాత ఆయనను పలుకరించిన మీడియాతో మాట్లాడుతూ అఖిలేష్ పై సంచలన అరోపణలు చేశారు. అఖిలేశ్‌తో ఉన్నవాళ్లంతా రౌడీలు, దందాలు చేసేవాళ్లని అరోపించారు.

బీజేపీలోగానీ, వామపక్ష పార్టీలో వారసత్వ రాజకీయాలకు అవకాశం ఉండదని వాజపేయి, అద్వానీలాంటి నేతలు అలాగే వచ్చారని గుర్తు చేశారు. ఎస్పీ బతకాలంటే నాయకత్వాన్ని వారసత్వం వెలుపలి నుంచి వెతికి చూడాల్సిందేనని అన్నారు. ‘ఎస్పీ ఓడిపోవడానికి ప్రధాన కారణం ఎంతోమంది ఎస్పీ నేతలు పార్టీని వదిలి బీఎస్పీలో చేరారు. ఎస్పీ ప్రధాన ఆత్మ ములాయంగారు. కాంగ్రెస్‌ పార్టీ ఆ విషయాన్ని గుర్తించడంలో ప్రజల్లోకి ఆయన సెంటిమెంట్‌ తీసుకెళ్లడంలో విఫలమైంది.  చూద్దాం పార్టీ భవిష్యత్‌ ఏమవుతుందో’ అని అమర్‌ సింగ్‌ అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Amar Singh  Samajwadi Party  leader  Uttar Pradesh  Assembly Elections  Congress  Mulayam Singh Yadav  

Other Articles