భూమానాగిరెడ్డికి తీవ్ర గుండెపోటు.. చికిత్సపోందుతూ కన్నుమూత.. Nandyala MLA Bhuma Nagi Reddy Dies Of Heart attack

Nandyala mla bhuma nagi reddy no more

bhuma nagi reddy, kurnool mla no more, nandyala mla no more, passed away, nandyala MLA, akhila priya, shoba nagi reddy

Rayalaseema stalwart, Nandyala MLA Bhuma Nagi Reddy died on Sunday after suffering a severe cardiac attack. He suffered the attack while in sleep and breathed his last undergoing treatment at a hospital in Nandyala town.

భూమానాగిరెడ్డికి తీవ్ర గుండెపోటు.. చికిత్సపోందుతూ కన్నుమూత..

Posted: 03/12/2017 12:38 PM IST
Nandyala mla bhuma nagi reddy no more

కర్నూలు జిల్లా రాజకీయాల నుంచి తన ప్రస్తానం ప్రారంభించి.. అనతికాలంలోనే హస్తిన వరకు తన సత్తాచాటుకున్న నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి గుండెపోటుతో కన్నుమూశారు. ఇవాళ తెల్లవారుజామున ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను ఆళ్లగడ్డలోని ఓ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన తరువాత మెరుగైన వైద్యం కోసం నంద్యాలకు తరలించారు. చికిత్సకు భూమా దేహం స్పందించలేదని.. దీంతో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు.

స్పృహలో లేని స్థితిలో నాగిరెడ్డిని నంద్యాలకు తీసుకొచ్చారని.. చికిత్సకు ఆయన దేహం స్పందించకపోవడంతో వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందించామని అయినా ఆయన స్పందించలేదని.. ఆయనను ప్రాణాలను నిలిపేందుకు చేసిన అన్ని ప్రయత్నాలు ఫలితాన్ని ఇవ్వలేకపోయాయని అస్పత్రి వర్గాలు తెలిపాయి. ఊహించని ఘటనతో భూమా కుటుంబసభ్యులు, అనుచరులు శోకసంద్రంలో మునిగిపోయారు. రమారమి మూడేళ్ల క్రితం శోభానాగిరెడ్డి మృతికి సంబంధించిన చేదు గురుతులు చెరిగిపోక ముందే భూమా కూడా మరణించడంతో అనుచరులు షాక్‌కు గురయ్యారు. రేపు సాయంత్రం ఆళ్లగడ్డలో భూమా నాగిరెడ్డి అంత్యక్రియలు జరగనున్నాయి.

1964 జనవరి 8న కర్నూలు జిల్లా దొర్నిపాడు మండలం కొత్తపల్లిలో భూమా జన్మించారు. భూమా నాగిరెడ్డికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. తండ్రి హత్య తర్వాత రాజకీయాల్లోకి భూమా నాగిరెడ్డి క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చారు. సోదరుడి మృతి తర్వాత 1992 ఉప ఎన్నికల్లో భూమా మొదటిసారి ఆళ్లగడ్డ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మూడుసార్లు లోక్‌సభ సభ్యుడిగా పనిచేశారు. 2014లో వైసీపీ నుంచి భూమా నాగిరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు.  మూడుసార్లు ఎంపీగా, రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2016లో కూతురు అఖిలప్రియతో కలిసి భూమా టీడీపీలో చేరారు.

2014 ఏప్రిల్‌ 24 న రోడ్డు ప్రమాదంలో భూమా సతీమణి శోభ మృతి చెందారు. శోభ మృతి తర్వాత భూమా నాగిరెడ్డి మానసికంగా కుంగిపోయారు. అనారోగ్యం కారణంగా ఆయనకు బైపాస్ సర్జరీ కూడా జరిగింది. ఏడాది నుంచి భూమా నాగిరెడ్డి ఆరోగ్యం సరిగా లేదు. భూమా నాగిరెడ్డి కూతురు అఖిలప్రియ ప్రస్తుతం ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. కాగా, నాగిరెడ్డి మృతికి కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌, రాష్ట్ర ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు, మంత్రులు, పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి సంతాపం వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles