అమెరికాలో భారతీయులే టార్గెట్.. మరో జాత్యంహకార దాడి. Man tries to burn store run by Indian-Americans

Man tries to burn store run by indian americans in florida

Florida, Indian-Americans, Shop, United States, Burning, Muslims, burn store, racist, racism, hate crime

In yet another incident highlighting the dangerously growing trend of racist attacks in the United States, a man in Florida tried to burn down a convenience store owned by Indian-Americans, thinking they were ‘Muslims’.

అమెరికాలో భారతీయులే టార్గెట్.. మరో జాత్యంహకార దాడి.

Posted: 03/12/2017 09:32 AM IST
Man tries to burn store run by indian americans in florida

అమెరికాలో జాత్యహంకార దాడులపై భారత అమెరికన్లు నిరసన ప్రదర్శనలు చేస్తున్నా.. స్వయంగా అమెరికా అధ్యక్షులే.. భారత్ తో సన్నిహిత సంబంధాలు పెట్టుకుంటామని స్పష్టం చేసినా.. అమెరికావాసుల్లో మాత్రం భారతీయులంటే శత్రువులుగా పరిగణిస్తున్నారు. కన్సాస్ లోని బార్ లో తెలుగువాడైన శ్రీనివాస్ పై అమెరికా వాసి కాల్పులు జరిపిన ఘటనలో అయన అక్కడికక్కడే మృతి చెందిగా, హర్పీత్ సింగ్ షాపు నుంచి తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో గుర్తుతెలియని అమెరీకన్లు జరిపిన దాడుల్లో మరణించాడు. ఇక తన ఇంటి ఎదుట కారు క్లీన్ చేస్తున్న మరో భారతీయుడిపై అమెరికా వాసులు కాల్పులు జరిపారు.

ఈ వరుస ఘటనలు మర్చిపోక ముందే.. తాజాగా ఫ్లోరిడాలో భారతీయ సంతతికి చెందిన వ్యక్తుల స్టోర్‌పై ఓ వ్యక్తి దాడికి ప్రయత్నించాడు. దానిని కాల్చివేసేందుకు ప్రయత్నం చేశాడు. అయితే, ఆ స్టోర్‌ భారత సంతతి పౌరులదని తనకు తెలియదని అరబ్‌ దేశానికి చెందిన ముస్లింలదని అనుకున్నానని చెప్పినట్లు తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ వలసలను అడ్డుకునేందుకు చట్టాన్ని తీసుకొచ్చినప్పటి నుంచి తొలుత దాడులు భారతీయులపైనే ఎక్కువవుతున్నాయి.

పోలీసుల వివరాల ప్రకారం.. రిచర్డ్‌ లాయిడ్‌ అనే 64 ఏళ్ల వ్యక్తి దర్జాగా దుకాణానికి నిప్పుపెట్టి చేతులు వెనక్కి పెట్టుకొని అది తగులబడుతుంటే నవ్వుతూ నిల్చున్నాడు. తమ దేశంలో అరబ్‌ దేశాలకు చెందిన ముస్లిలు అస్సలు ఉండొద్దనేది తన కోరిక అని అందులో భాగంగానే ఆ స్టోర్‌ను తగులబెట్టేందుకు ప్రయత్నించానని చెప్పాడు. తనను అరెస్టు చేసుకోవచ్చంటూ పోలీసులకు స్వయంగా చెప్పాడు. అతడికి ఉన్న అభిప్రాయంపట్ల అక్కడి అధికారులు విచారం వ్యక్తం చేశారు.

ఒక పౌరుడికి అరబ్‌ ముస్లింలపై కోపం ఉండటం దురదృష్టం అని, అది భారతీయ సంతతి పౌరులను చూసి అరబ్స్‌ అనుకొని దాడికి దిగడం మరింత బాధాకరం అని మాస్కారా అనే అధికారి తెలిపారు. గతంలో శ్రీనివాస్‌ కూచిబొట్లపై జరిగిన దాడిని కూడా ఆయన ప్రస్తావించారు. దాడికి పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేసి కోర్టుకు తీసుకెళ్లగా 30వేల డాలర్ల బాండు ఇవ్వాలని ఆదేశించడంతోపాటు జైలుకు తరలించాలని ఆదేశించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Florida  Indian-Americans  Shop  United States  Burning  Muslims  burn store  racist  racism  hate crime  

Other Articles