ఉత్తరాఖండ్ లో బీజేపి పాగా.. సీఎం రావత్ ఓటమి Uttarakhand: BJP leading in 44 seats

Uttarakhand bjp leading in 44 seats

harish rawat, uttarakhand Assembly elections results, uttarakhand Assembly elections leads, uttarakhand Assembly elections trends, uttarakhand elections, uttarakhand elections 2017, uttarakhand polls 2017, uttarakhand, BJP, Congress, politics

The BJP is leading in 55 seats in the 70-member Uttarakhand Assembly, while ruling Congress was racing ahead in 11, except Chief Minister Harish Rawat who lost Haridwar (Rural) seat.

ఉత్తరాఖండ్ లో బీజేపి పాగా.. సీఎం రావత్ ఓటమి

Posted: 03/11/2017 12:39 PM IST
Uttarakhand bjp leading in 44 seats

ఉత్తరాఖండ్‌లో అధికార కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. బీజేపి వైపు ఓటరు గాలి వీచింది. మూడింట రెండొంతులు దాటి.. ఏకంగా 80 శాతం వరకు సీట్లను బీజేపీ గెలుచుకుంటోంది. ఏకంగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీష్ రావత్ కూడా ఓటమిపాలయ్యారు. ఇప్పటివరకు వెల్లడైన ఆధిక్యాలు చూస్తే, మొత్తం 70 స్థానాలకు గాను 57 చోట్ల బీజేపీ, 10 చోట్ల కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉండగా.. ఇతరులు మరో మూడు చోట్ల ఇతరులు ముందంజలో ఉన్నారు.

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీష్ రావత్ తాను పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లోనూ ఓటమి పాలయ్యారు. హరిద్వార్ రూరల్ నుంచి తొలుత ఫలితం వచ్చింది. అక్కడ ఓడిపోయిన రావత్.. ఆ తర్వాత ఫలితం వెలువడిన కిచ్చా నియోజకవర్గంలో కూడా ఓటమి చవిచూడక తప్పలేదు. పర్వతప్రాంతమైన ఉత్తరాఖండ్‌లో ప్రతిసారీ ఎన్నికలు జరిగినప్పుడల్లా ప్రభుత్వాలు మారుతుండటం సర్వసాధారణం. ఈసారి కూడా అలాగే జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలున్న ఉత్తరాఖండ్ అసెంబ్లీలో అధికారం చేపట్టాలంటే కనీసం 36 స్థానాలు అవసరం అవుతాయి.

ప్రస్తుత అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి 32 స్థానాలు ఉండగా, బీజేపీకి 31, బీఎస్పీకి 3, ఉత్తరాఖండ్ క్రాంతి దళ్‌కు ఒకటి, స్వతంత్రులు ముగ్గురు ఉన్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ మీద అనేక అవినీతి ఆరోపణలు రావడంతో పాటు స్వయంగా ముఖ్యమంత్రి హరీష్ రావత్ కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దాంతో ఈసారి అక్కడ బీజేపీ అధికారం చేపట్టడం ఖాయమని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. ఈసారి బీజేపీకి కనిష్టంగా 29, గరిష్టంగా 53 వరకు స్థానాలు వస్తాయని వివిధ సర్వే సంస్థలు తెలిపాయి. కాంగ్రెస్ పార్టీ 15 నుంచి 30 స్థానాల లోపు పరిమితం అవుతుందని చెప్పాయి. దానికి తగినట్లుగానే ఆధిక్యాలు కూడా కనిపిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh