బీకాంలో ఫిజిక్స్ అన్నా ఎలాగున్నావే..?.. సెటైర్ కి రెస్పాన్స్ ఏంటి? | Jagan’s Physics in B.Com Joke in Assembly.

Jaleel khan on jagan satire in assembly

Physics in B.Com, Jagan Joke, Jagan Jaleel han, YS Jagan, B Com Physics MLA, MLA Jaleel Khan, Physics in B.Com AP Assembly, Jaleel Khan Roja, MLA Roja, AP Assembly TDP MLAs, Physics MLA Comedy, Jaganmohan Reddy Jaleel Khan, MLA Jaleel Khan Craze

YS Jagan Joking on Jaleel Khan in Assembly. Jagan stated some numbers and said, “Those who learned Physics in B.Com can not understand my numbers”.

జగన్ జోక్ చాలా లైట్ తీసుకున్నాడంట!

Posted: 03/08/2017 11:16 AM IST
Jaleel khan on jagan satire in assembly

ఏదైనా స్ట్రెయిట్ గా చెబితే ఎవరైనా వింటారా? ఇలా వంకరగానే చెబితే వైరల్ అయిపోతారంటున్నాడు ఎమ్మెల్యే జలీల్ ఖాన్. బీకాంలో ఫిజిక్స్ చేశానంటూ యాంకర్ తో నొక్కి మరీ మాట్లాడిన ఆయన తర్వాత ఎంత పాపులర్ అయ్యాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. ఉంటది... అంటూ ఆయన మీద వచ్చినన్ని ట్రోల్స్ ఈ మధ్య కాలంలో ఎవరి మీద రాలేదంటే అతిశయోక్తి కాదు. తన ఫుల్ వర్షన్ ఇంటర్వ్యూ ను ఎడిట్ చేసి ‘అలా’ చూపించారంటూ చెప్పినప్పటికీ ఆ వ్యవహారం మాత్రం ఆగట్లేదు. మరి అలాంటి వ్యక్తిని పట్టుకుని వ్యంగ్యంగా మాట్లాడితే ఊరుకుంటాడా?

కొత్త అసెంబ్లీ పైగా ఫస్ట్ డే జరిగిన చర్చలోనే ఆయనపై సెటైర్ పడింది. అసెంబ్లీ లో గవర్నర్ ఉపన్యాసంపై చర్చ సందర్భంగా వైసీపీ అధినేత జగన్ జలీల్ ఖాన్ మీద సెటైర్ వేశాడు. వ్యవసాయ రంగం గురించి మాట్లాడుతూ... లెక్కలతో వివరించిన జగన్, చివర్లో బీకాంలో ఫిజిక్స్ చదివిన వాళ్లకు ఈ లెక్కలు అర్థంకావంటూ వ్యాఖ్యానించాడు. అంతే ఆ దెబ్బకి అందరి చూపు ఒక్కసారిగా జలీల్ ఖాన్ వైపు మళ్లింది. విజయవాడ పశ్చిమ నుంచి వైసీపీ టికెట్ మీద గెలిచిన జలీల్ ఖాన్ తర్వాత టీడీపీలోకి జంప్ అయిన విషయం తెలిసిందే.

ఇక లోపలే కాదు బయట కూడా ఆయన్ను పలకరించిన ప్రతీ ఒక్కరూ బీకాం-ఫిజిక్స్.. అంటూ చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఎమ్మెల్యే రోజా హాయ్ ఫిజిక్స్ అని, మరో ఎమ్మెల్యే సునీల్ అయితే ఏకంగా ఏ బీకాం ఫిజిక్స్ అన్నా ఎలా ఉన్నావ్? అని ఇలా కనిపించిన ప్రతీ ఒక్కరూ కామెడీ చేస్తూ పోయారు. పైగా ఇంతేసీ ఉద్యమాలు, అరెస్టులు చేస్తున్నా రాని పాపులారిటీ ఒక్క ఇంటర్వ్యూతో వచ్చేసిందని కామెంట్ కూడా చేశారు. మాములుగా అయితే ఇలాంటి వ్యవహారాల్లో ఎవరికైనా మండాలి. కానీ, బీకాంలో ఫిజిక్స్ చేశాడు కదా. అందుకే ఆయనంత కూల్ గా ఉండగలుగుతున్నాడంటూ మరో సెటైర్ కూడా ఇప్పుడు ట్రోల్ అవుతోంది. జలీల్ కామెడీ ఇంతటితో ఆగలేకు పవన్ పై పోటీ చేసి కనీసం పది సీట్లతో అయినా గెలిచి తీరతానని, చంద్రబాబు మోదీ కంటే చాలా తోపు అని ఇలా వెరైటీ వెరైటీ స్టేట్ మెంట్లతో నిన్నంతా ఫిజిక్స్ గారి హవా సాగిందన్న మాట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : MLA Jaleel Khan  B.Com Physics  YS Jagan  

Other Articles

Today on Telugu Wishesh