మిస్టరీ చేధించాలని పన్నీరు నిరాహార దీక్ష.. Panneerselvam camp goes on statewide protest

Panneerselvam group begins hunger strike for probe into jayalalithaa s death

AIADMK, Palaniswami, late cm J Jayalalithaa, VK Sasikala, apollo hospital, O.Panneerselvam, hunger strike, Jayalalithaa’s death, Probe, CBI, R. Natarajan, Stalin, Bengaluru, PM modi, Governor, tamil politics

Tamil Nadu’s former chief minister O Panneerselvam and his followers began their one-day fast on Wednesday demanding a judicial inquiry into the death of former chief minister J Jayalalithaa.

మిస్టరీ వెనుక రహస్యం కోసం మాజీ ముఖ్యమంత్రి నిరాహారదీక్ష

Posted: 03/08/2017 12:00 PM IST
Panneerselvam group begins hunger strike for probe into jayalalithaa s death

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణంపై వున్న అనుమానాలను నివృత్తి చేసేందుకు సిబిఐ చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం ఇవాళ నిరాహార దీక్షకు పూనుకున్నారు. తన మద్దతుదారులైన ఎమ్మెల్యేలతో రాజరత్నం స్టేడియం బయట బుధవారం ఆయన దీక్షను ప్రారంభించారు. తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా అయన అనుయాయువులు, అమ్మ అభిమానులు కూడా ఈ ఒక్కరోజు నిరాహార దీక్షను చేపట్టారు.

అంతకు ముందు మార్చి 1న పన్నీరు సెల్వంకు మద్దతుగా ఉన్న అన్నాడీఎంకే ఎంపీలు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీని కలిశారు. జయలలిత మృతిపై విచారణ జరిపించాలని ఆయన్ని కోరారు. ఈ సందర్భంగా రాజ్యసభ ఎంపీ మైత్రేయన్‌ మాట్లాడుతూ జయలలిత మృతిపై ప్రజలకు సందేహాలు ఉన్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో అమ్మ మరణంపై సిబిఐ అధికారుల చేత విచారణ జరిపించి నిజానిజాలను వెలికి తీయాల్సిన అవసరముందని అమ్మ అభిమానులు కోరుతున్న నేపథ్యంలో పన్నీరు సెల్వం వర్గం నిరాహారదీక్షను చేపట్టారు.

ఇదిలావుండగా, తమిళనాట బలం పుంజుకునేందుకే పన్నీరుసెల్వం నిరాహార దీక్షకు పూనుకున్నట్లు కూడా వార్తలు అందుతున్నాయి. అసెంబ్లీలో బలనిరూపణలో విఫలమైన పన్నీరుసెల్వం వర్గం.. తమిళ నాట ప్రజల్లో తన పట్ల సానుభూతి వుందని నిరూపించుకునేందుకు కూడా ఈ దీక్ష దోహదపడుతుందని.. ఈ క్రమంలోనే ఆయన వర్గం దీక్షకు పూనుకుందని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యేల మద్దతు లేకున్నా, కేడర్‌ బలం తన వెంటే అని చాటుకునేందుకు తగ్గట్టుగా ఈ దీక్షల విజయవంతానికి కసరత్తులు చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ దీక్ష సాగనుంది. చెన్నైలో చేపాక్కం వద్ద దీక్ష చేపట్టేందుకు నిర్ణయించినా, పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఎగ్మూర్‌ రాజరత్నం స్టేడియం వద్దకు వేదికను మార్చిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : J Jayalalithaa  VK Sasikala  Palanisamy  apollo hospital  O.Panneerselvam  hunger strike  cbi  AIADMK  

Other Articles