మార్చి 28-29... ఉగాది ఏ రోజు జరుపుకోవాలి? | Ugadi 2017 March 28 or 29?

Telangana astrologers confusion on ugadi date end

Telangana Astrologers, Telangana Ugadi Date, Ugadi 2017, Confusion Ugadi Date, Ugadi Festival, Telugu States Ugadi Festival, Astrologers Ugadi, Ugadi Celebrations, Telnagana Government Ugadi

Telangana Astrologers announced to celebrate Ugadi on March 29 only.

ఇంతకీ ఉగాది పండగ ఏ తేదీనంటే...

Posted: 03/08/2017 10:03 AM IST
Telangana astrologers confusion on ugadi date end

ఈ యేడాది తెలుగు సంవత్సరం ఉగాదిని ఏ రోజు జరుపుకోవాలన్న దానిపై జ్యోతిష్యుల మధ్య భిన్నాభిప్రాయాలు రావటం తెలిసిందే. మార్చి 28న అని కొందరు, 29న అని కొందరు ఇలా వాదులాడుకుంటూ వస్తున్నారు. అయితే ఎట్టకేలకు ఎప్పుడు జరుపుకోవాలన్న చిక్కుముడి వీడింది. తేదీ విషయంలో విషయంలో స్పష్టత వచ్చింది.

ఈనెల 29నే ఉగాదిని జరుపుకోవాలని తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ అధ్యక్షుడు గంగు భానుమూర్తి సహా పలువురు సిద్ధాంతులు పేర్కొన్నారు. హైదరాబాద్‌ నల్లకుంటలోని శ్రీసీతారామాంజనేయ సరస్వతీ దేవాలయంలో భానుమూర్తి ఆధ్వర్యంలో మంగళవారం దృక్, పూర్వ గణిత పంచాంగ కర్తల సదస్సు నిర్వహించారు.

తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ ప్రధాన కార్యదర్శి పోచంపల్లి రమణారావు సహా పలువురు సిద్ధాంతులు పాల్గొన్న ఈ కార్యక్రమానికి శ్రీనివాస వాగ్దేయ సిద్ధాంత సమన్వయకర్తగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఈనెల 29నే ఉగాదిని జరుపుకోవాలని సూచించారు. ఐనవోలు అనంత మల్లయ్య సిద్ధాంతి కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. తొలుత కొడకండ్ల సిద్ధాంతి నృసింహరావు శాస్త్రీయ వైదికమార్గంలో ఈ నెల 28న ఉగాది అని ప్రకటించడంతో పండుగపై అయోమయం నెలకొన్న విషయం విదితమే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ugadi Festival  2017  Astrologers  March 29  

Other Articles