ఉమెన్స్ డే ప్రత్యేకం: బీ బోల్డ్ ఫర్ బెటర్ సోసైటీ | International Womens Day special.

International womans day special

International Women's Day, International Women's Day Slogan, International Women's Day 2017, Be Bold For Change

International Women's Day Special. Story.

ఉమెన్స్ డే స్పెషల్: బి బోల్డ్ ఫర్ ఛేంజ్!

Posted: 03/08/2017 09:08 AM IST
International womans day special

సాధికారిత..సమానత్వం దిశగా అడుగులు వేసే మహిళల గురించే ప్రస్తావించే సందర్భం ఇది. నేటికీ మేటి విలువలతో రాణిస్తున్న మహిళామణులు ఎందరో..ఇందులో భారతీయ మహిళ కూడా తనకంటూ గుర్తింపు కోసం అహర్నిశలూ కృషిచేస్తూనే ఉంది. విభిన్న రంగాల్లో భారతీయ మహిళలు మేలైన విజయాలనే సొంతం చేసుకున్నారు. వారి స్ఫూర్తి రేపటి ఆశతో ముందడుగు వేసే నేటి మహిళకి ఆదర్శం. వివక్ష, అసమానతల్లాంటివి వెనక్కి లాగుతున్నా తన జీవన పరిధిని విశాలం చేసుకుంటూ ఉన్నతంగా ఎదుగుతోంది. అడుగులు తడబడుతున్నా తరుణి.. పట్టుదలగా ముందుకు సాగిపోతోంది.

విశ్వవ్యాప్తంగా వనితకు వందనం చెప్పే రోజు ఇది. చాలాకాలంగా ఇంటికే పరిమితమైన ఇంతి ఇప్పుడు అంతరిక్షంలో సాహసాలు చేస్తోంది. కాస్తంత వయసు రాగానే బడికి టాటా చెప్పేసే పరిస్థితి దాటివచ్చిన మహిళ ఈ రోజుల్లో ధైర్యంగా పాఠాలు చెబుతోంది. గుణపాఠాలూ నేర్పుతోంది. ఇంటిపనికి చిరునామాగా మార్చేసిన రోజులనుంచి బయటపడి చిరుదరహాసంతో పనులు చక్కబెట్టి ఉన్నత శిఖరాలను అధిరోహించి గర్వంగా సమాజాన్ని చూస్తోంది నేటి మహిళ. బాక్సింగ్ రింగ్‌లో పిడిగుద్దులు కురిపిస్తున్నవారు.. కుస్తీ వేదికపై బస్తీమే సవాల్ అంటూ సింహనాదం చేస్తున్నవారు, ఎవరెస్టు ఎక్కిన మహిళలు, అతిపెద్ద ఆర్థిక సంస్థలను ఒంటి చేత్తో లాభాలబాటలో నడిపిస్తూ అదే సమయంలో ఇంటినీ చక్కదిద్దుతున్న అతివలు ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు. గతంతో పోలిస్తే మహిళలు చాలారంగాల్లో అడుగులు ముందుకువేస్తున్నా.. ఇంకా అణచివేత కొనసాగుతోంది.

పంతొమ్మిదవ శతాబ్దం తొలినాళ్లలోనే సమాన హక్కులకోసం అమెరికాలో నినదించిన మగువ తెగువ! రష్యాలో జారును బేజారెత్తించిన ధీశాలి సాహసం! ఐరోపా దేశాల్లో కదం తొక్కిన మహిళాఉద్యమం! ఏ సందర్భంలో పురుడుపోసుకున్నదైనా.. 1975లో మార్చి 8న స్థిరపడింది అంతర్జాతీయ మహిళా దినోత్సవం! తాము సగభాగం ఉన్న సమాజంలో సమాన హక్కులకోసం.. సమాన అవకాశాల కోసం.. సమసమాజం కోసం.. ఒక లక్షిత పోరాటం! ఆకాంక్ష ఏండ్లనాటిదేనైనా.. మార్చి 8 ఒక మజిలీ! స్థాయీసామర్థ్యాలను అంచనావేసుకుని.. భావి భవిష్యత్తుకు బాటలు తీసే సందర్భం! ఇప్పుడు మరోసారి! శతాబ్దాల సంకెళ్లను ఒక్కొక్కటిగా తెంచుకుంటూ ముందుకు సాగుతున్నా.. ఇంకా అనేక అమానుషాలు.. అవమానాలు! క్రీడలు మొదలుకుని.. ఆర్థిక వ్యవస్థ.. అంతరిక్షం.. అంతర్జాలాన్ని సైతం శాసించే స్థాయికి మహిళ ఎదుగుతున్నా.. ఇంకా అవే అన్యాయాలు! భారతదేశమూ మినహాయింపుకాదు!

ముఖ్యంగా అక్షరాస్యత లేని చోట, పేదరికం వేధిస్తున్నచోట, చివరకు ఇళ్లల్లో మహిళలపట్ల చిన్నచూపు, వేధింపులు ఉంటూనే ఉన్నాయి. రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాల్లో సమూల మార్పులు వచ్చి మహిళలకు సమాదరణ లభిస్తే, సాధికారత సాధ్యమైతే మరెన్నో మేలు మలుపులు సాధ్యమవుతాయి. ఈ ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవం కోసం ‘బి బోల్డ్ ఫర్ ఛేంజ్’ అన్న నినాదంతో మార్పుకోసం అడుగులు వేస్తోంది మహిళాలోకం. అదే లక్ష్యంతో సాగే మహిళలకు వందనం చెబుతోంది ఈ లోకం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : International Women's Day  Special Article  Be Bold For Change  

Other Articles