కేంద్ర మంత్రి స్పెషల్ జాకెట్ గొప్పతనం తెలుసా? | AC Jacket Launched by Union Minister Giriraj Singh.

Minister giriraj singh launches ac jacket

Giriraj Singh, Union Minister Giriraj Singh, AC Jacket Launch, Giriraj Singh AC Jacket, AC Jacket India, Special Jacket Indian Army, Climate Gear Technology, AC Jacket Indian Market, AC Jackets Makers

Minister Giriraj Singh Launches 'AC Jacket' With Climate Control Buttons. Reports suggest the jacket is fitted with cold and hot air fans, which are battery operated. An MIT graduate reportedly helped devise this "climate gear" technology.

ఎప్పుడైనా.. ఎక్కడైనా... ఏసీ జాకెట్

Posted: 03/08/2017 08:45 AM IST
Minister giriraj singh launches ac jacket

రానున్నది సమ్మర్. గ్రీన్ హౌస్ వాయువులు, పైగా పొల్యూషన్ ఎఫెక్ట్ తో ఈసారి ఉష్ణోగ్రతలు చంపేస్తాయని ఇదివరకే వాతావరణ శాఖ హెచ్చరించింది కూడా. అయితే ఈ జాకెట్ గనుక ధరిస్తే మీరు చల్లగా ఉంటారంటున్నాడు కేంద్ర మంత్రి గిరి రాజ్ సింగ్. బీహార్ లోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(నిఫ్ట్) విద్యార్థులు తయారు చేసిన ఎయిర్ కండిషనర్ జాకెట్ ను ఆయన నియోజకవర్గం కాన్వాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆవిష్కరించాడు.

ఇంతకీ ఈ ఏసీ జాకెట్ ప్రత్యేకత ఏంటంటే.. క్లైమెట్ గేర్ టెక్నాలజీ ఆధారంగా నిఫ్ట్ విద్యార్థులు దీనిని రూపొందించారు. గడ్డకట్టే 0 డిగ్రీల సెల్సియస్ నుంచి 50 డిగ్రీల వేడి పరిస్థితుల దాకా ఉష్టోగ్రతలను పెంచుకునే సౌకర్యం ఈ జాకెట్ లో ఉండటమే. ఎర్ర బటన్ వేడి కోసం, గ్రీన్ బటన్ చల్లబరుచుకోడానికి ఏర్పాటు చేయబడి ఉంటాయి. ఒకేసారి 20డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ ను ఒకేసారి తగ్గించుకోవటం, పెంచుకోవటం లాంటివి చేయొచ్చు కూడా.

ప్రస్తుతం ఈ జాకెట్ లను ప్రయోగాత్మకంగా పరిశీలించి మార్కెట్ లోకి రిలీజ్ చేస్తామని, త్వరలో సైనికులకు అందజేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఇంతకీ దీని ధర ఎంతో తెలుసా? స్లీవ్ లెస్ అయితే 18,000, ఫుల్ జాకెట్ అయితే 25,000 గా నిర్ణయించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Union Minister Giriraj Singh  AC Jacket  

Other Articles