ఓవైపు చివరి దశ పొలింగ్ జరుగుతున్న వేళ ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో నడిబొడ్డున మంగళవారం ఓ ఉగ్రవాది కలకలం రేపిన విషయం తెలిసిందే. ఎట్టకేలకు అతన్ని ఎన్ కౌంటర్ లో మట్టుపెట్టారు పోలీసులు. విశ్వసనీయ సమాచారంతో టెర్రరిస్టుల కోసం వల వేసిన ఏటీఎస్ దళాల ఆనుపానులు గమనించిన ఉగ్రవాది లక్నోలోని ఠాకూర్ గంజ్ లోని ఓ ఇంట్లో దాక్కుని కాల్పులు ప్రారంభించాడు. దీంతో అప్రమత్తమైన ఏటీఎస్ దళాలు ఆ ఇంటిని చుట్టుముట్టాయి.
కాల్పులు, ఎదురు కాల్పులతో మార్మోగిపోయింది. బాగా చీకటిగా ఉండటంతో తొలుత ఇంటి లోపల ఇద్దరు టెర్రరిస్టులు ఉన్నట్లు అధికారులు భావించారు. ఏకధాటిగా 12 గంటలపాటు ఈ కాల్పులు కొనసాగటం విశేషం. మరోవైపు తొలుత ఏం జరుగుతుందో అర్థంకాక స్థానికులు భీతిల్లిపోయారు. ఉదయం మూడు గంటల ప్రాంతంలో ఆపరేషన్ ముగిసినట్లు పోలీసులు వెల్లడించారు. ఓ మృతదేహం, గన్, కత్తి స్వాధీనం చేసుకున్నారు.
ఇక చనిపోయిన వ్యక్తిని ఐఎస్ ఉగ్రవాది సైఫుల్లాగా పోలీసులు గుర్తించారు. ఇరాక్, సిరియా దేశాల్లో చావుదెబ్బ తిన్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ప్రస్తుతం ఇండియాపై కన్నేసిందని, భారత్ ను స్థావరంగా చేసుకునే దాడులు చేయబోతుందన్న అనుమానాలు కూడా ఓవైపు కలుగుతున్నాయి.
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ప్రభావంతోనే సైఫుల్లా పనిచేశాడని, ఐసిస్ ఖురసాన్ మాడ్యూల్‌కు చెందివాడని యూపీ పోలీసులు నిర్ధారించారు. బహుశా మంగళవారం ఉదయం జరిగిన రైలు పేలుడుకు ఇతగాడికి ఏమైనా సంబంధం ఉందా? అని ఆరాతీస్తున్నారు. ఉజ్జయిని-భోపాల్ మధ్య ప్యాసింజర్ రైలులో నిన్న ఘటన జరగ్గా, తొమ్మిది మంది తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అక్కడి రైల్వే స్టేషన్ లలో సీసీ పుటేజీల ఆధారంగా ఆరుగురు అనుమానితులను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు వారు వెల్లడించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more