మరోసారి మా మతంపై మొరిగితే.. నీ ముఖంపై యాసిడ్ పోస్తా..! islam man threats anjiya ashmina on social media

Islam man threats anjiya ashmina on social media

Azniya Ashmin, kerala woman, kerala woman activist, kerala woman threatened with acid attack, acid attack, acid attack threat on facebook, muslim fanatics

Azniya Ashmin, a Bengaluru-based Kerala woman, put up a photo of herself sporting a 'bindi' and no hijab, and comments from Muslim fanatics in Kerala flooded the section. While some asked whether she really is a Muslim, one fellow wanted acid thrown in her face if she 'barks against Islam'.

మరోసారి మా మతంపై మొరిగితే.. నీ ముఖంపై యాసిడ్ పోస్తా..!

Posted: 03/07/2017 11:40 AM IST
Islam man threats anjiya ashmina on social media

తమ మతానికి చెందిన యువతిపై దారుణానికి ఒడిగడతానని ఓ యువకుడు బహిరంగంగా హెచ్చరించాడు. తమ మతాన్ని కించపర్చుతూ వ్యాఖ్యలు చేస్తే నీ ముఖంపై ఆమ్లా (యాసిడ్)ను పోస్తానని ఏకంగా ఆ యువతికి చెందిన సోషల్ మీడియా అకౌంట్లో హెచ్చరికలు చేశాడు. ఇస్లాంకు వ్యతిరేకంగా మొరిగితే.. ముఖం మీద యాసిడ్ పోస్తానంటూ బెంగళూరులో ఉండే మళయాళీ యువతి అంజియా అష్మిన్‌ను బెదిరించాడు. సమాజంలో ఉన్న పలు రకాల రుగ్మతలపై కోజికోడ్‌కు చెందిన అంజియా తరచు సోషల్ మీడియాలో స్పందిస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా తమ మతంలో మహిళల పట్ల కోనసాగుతున్న అంక్షలపై అమె నిత్యం గళమెత్తుతూ వుంటారు.

దీంతో అంజియా ఆష్మిన్ కు ఇటు బెంగళూరుతో పాటు తన స్వరాష్ట్రమైన కేరళలోనూ.. ఫేస్‌బుక్ సర్కిళ్లలో చాలా ఫాలోయింగ్ వుంది. అమె పోస్టులు కొందరిని అటోచింపచేయగా, మరికోందరికి మాత్రం తీవ్ర అగ్రహాన్ని కలిగించాయి. ఇలా అగ్రహం తెచ్చుకున్న కేరళకు చెందిన ఓ ముస్లిం యువకుడు.. అమెకు ఫెస్ బుక్ ద్వారా ఏకంగా బహిరంగ హెచ్చరికలకు పాల్పడ్డాడు. తమ మతంపై మరోసారి మెరిగితే.. నీ ముఖంపై యాసిడ్ పోస్తానని తీవ్ర హెచ్చరికలు చేశారు. అయితే సదరు యువతి కూడా తమ మతానికి చెందినదే అన్న విషయాన్ని మర్చిపోయాడు.

ఇటీవల ఆమె ఫేస్‌బుక్‌లో ఇద్దరు పురుషులు, ఒక మహిళతో కలిసి తానున్న ఫొటో ఒకదాన్ని ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేశారు. కాసేపటికే దానిపై కామెంట్లు వెల్లువెత్తాయి. అందులో ఆమె నుదుటి మీద బొట్టు పెట్టుకోవడమే కాక, ముసుగు కూడా ధరించలేదు. దాంతో.. నిజంగా నువ్వు ముస్లింవేనా అంటూ కొంతమంది ఆమెను తిట్టిపోయడం మొదలుపెట్టారు. మరి కాసేపటికి వ్యభిచారి అంటూ కామెంట్ చేశారు. ఇంతకుముందు మళయాళీ ముస్లిం నటులు ఆసిఫ్ అలీ, ఫహాద్ ఫాసిల్, దుల్కర్ సల్మాన్ తమ భార్యలతో కలిసి ఉన్న ఫొటోలు పోస్ట్ చేసినప్పుడు వాళ్లు కూడా ముసుగులు ధరించకపోవడంతో ఇలాంటి వ్యాఖ్యలు వాళ్ల మీద కూడా గతంలో చేశారు.

అయితే.. ఈ వ్యాఖ్యలతో అంజియా ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. తాను తన ఇష్టం వచ్చినట్లు జీవిస్తానని, అడగడానికి మీరెవరంటూ గట్టిగా చెప్పుతో కొట్టినట్లు సమాధానం ఇచ్చింది. ఇస్లామిక్ సనాతనవాదాన్ని, మోరల్ పోలీసింగును ఆమె ఘాటుగా విమర్శించింది. అయితే.. ఆమె వ్యాఖ్యలతో ఇగో దెబ్బతిన్న మునీర్ ధీర అనే ఫేస్‌బుక్ యూజర్ అయితే, ఆమె మరోసారి ఇస్లాంకు వ్యతిరేకంగా మొరిగితే ముఖం మీద యాసిడ్ పోస్తానని బెదిరించాడు. అయితే.. కేవలం విమర్శలు మాత్రమే కాదు, అంజియాకు మద్దతుగా కూడా చాలామంది నిలిచారు. తన ఇష్టం వచ్చినట్లు జీవించే హక్కు ఆమెకు ఉందని, ఆమె మీద మతాన్ని రుద్దడం సరికాదని కూడా అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Azniya Ashmin  kerala woman activist  threat  acid attack  facebook  muslim fanatics  

Other Articles