అమ్మో.. అంత పెద్దమొత్తంలో నల్లడబ్బే..! Rs. 70K crore worth black money detected since demonetisation

Rs 70k crore worth black money detected since demonetisation

black money, demonetisation, 70,000 crore, union government, PM modi, justice Arijit Pasayat, supreme court, special investigative team

Black money worth Rs. 70,000 crore has been unearthed through different schemes of the government, said Deputy Chairman of the Supreme Court-appointed SIT on black money, Justice Arijit Pasayat

నోట్ల రద్దుతో భయటపడిన నల్లధనం ఎంతో తెలుసా.?

Posted: 03/07/2017 11:00 AM IST
Rs 70k crore worth black money detected since demonetisation

పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా దేశంలో 70 వేల కోట్ల రూపాయల నల్లధనం బయటకు వచ్చిందని నల్లధనంపై సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన సిట్ డిప్యూటీ చైర్మన్ జస్టిస్ అరిజిత్ పసాయత్ వెల్లడించారు. ఏప్రిల్‌ మొదటివారంలో సుప్రీం కోర్టుకు ఆరో మధ్యంతర నివేదిక సమర్పించనున్నట్టు తెలిపారు. నవంబర్ 8న ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్ట ప్రకటించిన సంగతి తెలిసిందే. 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేసి, వాటి స్థానంలో కొత్తగా 500, 2000 రూపాయల నోట్లను చెలామణిలోకి తెచ్చారు.

నల్లధనాన్ని నిర్మూలించడానికి గత రెండేళ్లుగా సిట్ మధ్యంతర నివేదికల ద్వారా పలు ప్రతిపాదనలు చేసిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం చాలా వరకు ఈ ప్రతిపాదనలను ఆమోదించిందని, కొన్ని పరిశీలనలో ఉన్నాయని తెలిపారు. లెక్కల్లో చూపకుండా 15 లక్షల రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ మొత్తాన్ని దాచుకోవడాన్ని తీవ్రంగా పరిగణించాలని ప్రతిపాదన చేసినట్టు చెప్పారు. సిట్ సిఫారసు మేరకు ప్రభుత్వం ఇప్పటికే 3 లక్షల  రూపాయల కంటే ఎక్కువ మొత్తాన్ని నగదు రూపంలో తీసుకెళ్లడంపై ఆంక్షలు విధించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రైవేట్ విద్యాసంస్థలు, నగల వ్యాపారులు, రియల్ ఎస్టేట్ కంపెనీలు, ఆధ్యాత్మిక వేత్తలు, మాఫియా డాన్‌ల ఆర్థిక అవకతవకలపై విచారణ చేయాల్సిందిగా ఒడిశా క్రైం బ్రాంచ్ అధికారులను ఆదేశించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : black money  demonetisation  70  000 crore  union government  PM modi  justice Arijit Pasayat  supreme court  

Other Articles