ట్రంప్ ఎఫెక్ట్: అమెరికాలోనే కాదు అక్కడ కూడా అంతేనంట ! | Trump Effect Has Arrived New Zealand.

Indian assaulted in new zealand faces racist rant

New Zealand Hate Crime, Indians Attack New Zealand, Racist Rant New Zealand, New Zealand Indians Attack, New Zealand Indians Attack, Racism New Zealand, Trump Effect New Zealand, Auckland Indian Attack

Indian national assaulted, spat on in New Zealand's Auckland.

జాతి వివక్షత... ఇంకో దేశంలో కూడానా?

Posted: 03/07/2017 10:21 AM IST
Indian assaulted in new zealand faces racist rant

భారతీయులపై జాతి వివక్షత దాడులు ఇప్పుడు మరో దేశానికి కూడా పాకాయి. న్యూజిలాండ్ లో సైతం ఇదే తరహా విద్వేషపూరిత దాడులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఓ సిక్కు యువకుడిపై స్థానికుడు జాత్యహంకార వ్యాఖ్యలు చేస్తూ దూషించిన ఘటనపై నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.

గతవారం నరీందర్వీర్ సింగ్ అనే యువకుడు, తన కారును పార్కింగ్ నుంచి తీస్తుండగా, ఓ జంట మరో వాహనంలో వచ్చిన సమయంలో, ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. కారు నడుపుతున్న వ్యక్తి నరీందర్వీర్ ను తమ దేశం విడిచి వెళ్లాలని బెదిరిస్తూ, అసభ్య పదజాలంతో దూషించినట్టు సమాచారం. వారు వెళ్లిపోయేటప్పుడు తాను పక్కకు తప్పుకున్నానని, కారులోని యువతి తనవైపుకు వేలు చూపించగా, అతను తిట్ల దండకానికి దిగాడని, చాలా అవమానకరంగా మాట్లాడాడని బాధితుడు వాపోయాడు.

 

ఈ ఘటనను తాను వీడియో తీయగా, అతను మరింత రెచ్చిపోయాడని చెప్పాడు. కాగా, మరో ఘటనలో విక్రమ్ జిత్ సింగ్ అనే వ్యక్తిపై స్థానికుడు అసభ్యంగా మాట్లాడుతూ, ఇండియాకు తిరిగి వెళ్లిపోవాలని బెదిరించినట్టు తెలుస్తోంది. తాజా ఘటన లాంటిదే గత వారం కూడా ఒకటి చోటుచేసుకున్నట్లు ఆలస్యంగా తెలుస్తోంది.

విక్రమ్ జిత్ సింగ్ అనే వ్య్తక్తి రోడ్డు మీద వెళ్తుండగా అతన్ని ఫాలో అయిన ఓ వ్యక్తి దేశం విడిచిపోవాలంటూ అసభ్యపదజాలంతో దూషించినట్లు సమాచారం. కాగా, వరుస ఘటనలపై న్యూజిలాండ్ లోని ఇండియన్ కమ్యూనిటీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ట్రంప్ పగ్గాలు చేపట్టాకే మిగతా దేశాల్లో కూడా ఇలాంటి భావజాలం పెరిగిపోతూ రావటం శోచనీయమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : New Zealand  Hate Crime  Indian Attack  Racism  

Other Articles