బ్యాంకులపై ఆన్ లైన్ వార్... ‘నో ట్రాన్సాక్షన్ డే’ ఆ తేదీనే ఎందుకు? | Protest and Call For April 06, 2017 As No Transaction Day.

No transaction call gains ground against bank fees

No transaction Day, Bank Fees Protest, SBI Accounts Close, Account Holders Warn SBI, SBI Fee Charges, SBI New Rules, Online War Against Banks, Bank Fees Protest, April 06 2017 No transaction Day

No transaction call gains ground against bank fees. Protest and Call For April 06, 2017 As No Transaction Day.

బ్యాంకులపై భారతీయుడి దండయాత్ర

Posted: 03/07/2017 09:43 AM IST
No transaction call gains ground against bank fees

డబ్బు ఏసినా, తీసినా, ఆన్ లైన్ లావాదేవీలు చేసినా, చివరకి బ్యాలెన్స్ చెక్ చేసినా అంతెందుకు అసలు కార్డు వాడినా.. ఇలా ఏం చేసినా ఎడాపెడా బాదుడేనా? కొన్ని ప్రైవేట్ బ్యాంకులతోసహా భారతీయ స్టేట్ బ్యాంకు(ఎస్‌బీఐ) సిద్ధమైన నేపథ్యంలో ఖాతాదారుడు పోరాటానికి సిద్ధమవుతున్నాడు. ముఖ్యంగా మినిమమ్ బ్యాలెన్స్, అదనపు ఛార్జీల పేరుతో అడ్డగోలుగా వసూలు చేసేందుకు సిద్ధం అవుతుండటంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సామాన్యులు. తమ డబ్బులు తాము తీసుకునేందుకు ఈ ఆంక్షలు పెట్టడం ఏంటంటూ మండిపడుతున్నారు.  (బ్యాంకు లావాదేవీలు.. ఇక చుక్కలే)

మరో పక్క మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెన్ చేయకపోతే మోత మోగిపోతుందంటూ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్‌బీఐ చెప్పటం, దాన్నే ప్రైవేటు బ్యాంకులు కూడా అనుసరించే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు కూడా. దీంతో ఆ అవకాశం ఇవ్వకుండా సోషల్ మీడియా ద్వారా పెద్ద ఎత్తున ఎస్‌బీఐకి వ్యతిరేకంగా ఉద్యమం మొదలుపెట్టారు. బ్యాంకులు దిగొచ్చే వరకు ఉద్యమం కొనసాగుతుందని సామాన్యులు హెచ్చరిస్తున్నారు. ఇందులో భాగంగా ఏప్రిల్ 6ను ‘నో ట్రాన్సాక్షన్ డే’గాను పాటించాలంటూ పిలుపునిస్తూ ఓ సందేశం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఆ తేదీన ఎవరూ ఎలాంటి లావాదేవీ జరపకూడదని.. బ్యాంకుల తీరుపై భారతీయుడి నిరసనను తెలియజేయాలని చెబుతున్నారు. ఆర్ బీఐ కొత్త నిబంధనలు.. బ్యాంకుల సరికొత్త బాదుడుపై ఎవరూ ఇళ్లు కదలకుండా.. ఎవరి పని మానుకోకుండానే తమ మౌన నిరసనతో తాట తీయాలని కోరుతున్నారు. ఒకవేళ అప్పటికి కేంద్రం కానీ.. బ్యాంకులు కానీ దిగిరాకపోతే.. ఇదే తీరులో మౌన నిరసనను ఏప్రిల్ 24 - 25 - 26 తేదీల్లోనూ నిర్వహించాలని పిలుపునిస్తున్నారు. అయితే ఏప్రిల్ 1 నుంచే బాదుడికి సిద్ధం అవుతుండటంతో ఆ లోపే ఇలాంటి నిరసన వ్యక్తం చేసి సత్తా చూపించాలని పలువురు కోరుతున్నారు.

ఖాతాలు క్లోజ్ చేస్తాం!

ఆంక్షలతో ఆడుకోవాలని చూస్తున్న ఎస్ బీఐకి ‘టైం’ మాదంటూ ఖాతాదారులు హెచ్చరిస్తున్నారు. చీటికి మాటికి ఛార్జీల పేరుతో చిల్లు పెడితే తమ వల్ల కాదని తెగేసి చెబుతున్నారు. ఖాతాల్లో కనీసం రూ.5వేలను తాము ఉంచలేమని, ఖాతాలు మూసేస్తామని హెచ్చరిస్తున్నారు. తమనుంచి పిండి మాల్యా లాంటి వారికి అప్పులు ఇచ్చేందుకే ఇటువంటి నిబంధనలు విధిస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. ప్రతి అంశానికి పన్నుపోటు పరిధిలోకి తీసుకొచ్చిన కేంద్రం తీరుకు తగ్గట్లే.. బ్యాంకుల నిర్ణయంపై సగటు భారతీయుడు పిలుపునిచ్చిన ఈ ఆన్ లైన్ వార్ కి తలొగ్గుతారా వెయిట్ అండ్ సీ.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : No transaction Day  April 06 2017  Bank Fees Protest  

Other Articles

Today on Telugu Wishesh