అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్యలే.. భారతీయులపై దాడులకు కారణం.. US shooting: Deep Rai, out of danger, Sushma Swaraj tweets

Us shooting deep rai out of danger sushma swaraj tweets

sushma swaraj, sikh man, sikh man shot, us sikh man, us sikh man shot, us gun crime, sikh man shot in us, indian shot in us, us indian shot

Hours after a 39-year-old Sikh man was injured in a shooting incident in Kent city, External Affairs Minister Sushma Swaraj spoke to the victim’s father and inquired about his health

అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్యలే.. భారతీయులపై దాడులకు కారణం..

Posted: 03/05/2017 02:57 PM IST
Us shooting deep rai out of danger sushma swaraj tweets

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్ విద్వేషపూరిత వ్యాఖ్యల వల్లే భారతీయులపై దాడులు జరుగుతున్నాయని, శ్వేతజాతి దుండగుడి కాల్పుల్లో గాయపడ్డ దీప్ రాయ్ తండ్రి సర్దార్ హర్‌పాల్ సింగ్ అన్నారు. తన కొడుకు చేతిలోకి బుల్లెట్ దూసుకెళ్లిందని, ఆస్ప్రతిలో కోలుకుంటున్నాడని, ప్రాణాపాయం తప్పిందని భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మ స్వరాజ్కు చెప్పారు. వాషింగ్టన్‌ రాష్టంలోని కెంట్‌ నగరంలో శ్వేతిజాతి దుండగుడు జాతివివక్షతో మీ దేశానికి వెళ్లిపో అంటూ సిక్కు వ్యక్తి దీప్ రాయ్‌(39)పై ఆయన ఇంటి బయటే కాల్పులు జరిపాడు.

ఈ ఘటనలో దీప్ రాయ్ తీవ్రంగా గాయపడ్డారు. అమెరికాలో భారతీయుల పట్ల వరుసగా జరుగుతున్న దాడుల పట్ల సుష్మా స్వరాజ్ విచారం వ్యక్తం చేశారు. దీప్ రాయ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇటీవల అమెరికాలో కాల్పుల్లో మరణించిన హర్నీష్‌ పటేల్ కుటుంబానికి సానుభూతి తెలిపారు. హర్నీష్ దారుణహత్య తనను కలచివేసిందని సుష్మా ట్వీట్ చేశారు. ఆయన కుటుంబ సభ్యులతోనూ ఆమె మాట్లాడారు. హర్నీష్‌ కంటే ముందు అమెరికాలో తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ శ్రీనివాస్ కూచిభొట్ల దారుణహత్యకు గురైన సంగతి తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sushma swaraj  Srinivas Kuchibhotla  Harnish Patel  Deep rai  hate crimes  Donald Trump  

Other Articles