ట్రంప్ ఈజ్ అవర్ ప్రెసిడెంట్.. తలలు పగులుతున్నాయ్... | Attack on Trump Supporters.

Trump supporters increased day by day

Donald Trump, Trump Supporters, Trump is our President, America Liberal Activists, Berkeley Donald Trump, Donald Trump Anti Rallies, Donald Trump Supporters, Donald Trump Fans

Violent clashes break out between President Donald Trump supporters and liberal activists as thousands join rallies supporting The Donald across America.

సీన్ రివర్స్: ట్రంప్ ఈజ్ అవర్ ప్రెసిడెంట్

Posted: 03/06/2017 09:35 AM IST
Trump supporters increased day by day

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేరెత్తితే చాలు మొన్నటిదాకా అంతఎత్తున ఎగిరిపడ్డ సొంత ప్రజలే ఇప్పుడాయనకు బ్రహ్మరథం పడుతున్నారు. గతంలో ఆయనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు కనిపించిన చోటే ఇప్పుడు ఆయన మద్దతుదారులు అనుకూల ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. అమెరికన్ ఫస్ట్ పేరిట వీసా విధానాలతో నిర్ణయాలతో దూసుకుపోతున్న ట్రంప్‌ను కొనియాడుతూ కొలరాడో నుంచి న్యూయార్క్‌లోని ట్రంప్ టవర్ వరకు, అలాగే వాష్టింగ్టన్ స్మారక చిహ్నం వద్ద వందలాదిమంది ట్రంప్ అనుకూల నినాదాలు చేస్తూ ప్రదర్శనలు నిర్వహించారు.

ట్రంప్ లైఫ్‌సైజ్ కటౌట్లను చేబూని అధ్యక్షుడిని కొనియాడుతూ ర్యాలీలు నిర్వహించారు. మినెసొటాలోని సెయింట్‌పాల్‌లో నిర్వహించిన ర్యాలీలో 400 మందికిపైగా హాజరయ్యారు. మరోవైపు 50 మంది ట్రంప్ వ్యతిరేకులు ప్రదర్శనలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సమావేశ మందిరంలో టపాసులు కాల్సిన ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కాగా బర్కిలీలో 500 మంది ట్రంప్ కి అనుకూలంగా ర్యాలీ నిర్వహించగా, వ్యతిరేకంగా మరో ర్యాలీ జరిగింది. రెండు వర్గాల వారు హెల్మెట్లు, మాస్కులు ధరించి పరస్పరం కొట్లాటకు దిగారు. పోలీసులు రంగప్రవేశం చేసి వారిని అదుపు చేశారు. ఈ దాడిలో సుమారు 50 మందికి తీవ్ర గాయాలయినట్లు సమాచారం. ఏది ఏమైనా ప్రపంచ దేశాల దృష్టిలో వివాదాస్పద నిర్ణయాలతో శత్రువుగా మారుతున్నప్పటికీ, సొంత దేశంలో మాత్రం ఫ్యాన్స్ ను పెంచుకునే పనిలో ఉన్నాడు ట్రంప్.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : America  President Donald Trump  Support Rally  

Other Articles

Today on Telugu Wishesh