ఇంధన బాంబు పేలింది.. లీటరు పెట్రోల్‌పై రూ 3.78ల పెంపు Petrol price up by Rs 3.78, diesel by Rs 1.70 as TN revises VAT

Petrol price up by rs 3 78 diesel by rs 1 70 as tn revises vat

Petrol, diesel prices in TN up as state hikes VAT on them, Tamil Nadu petrol, diesel prices up on VAT revision, Tamil Nadu, VAT,India ,Tamil Nadu ,energy and resource ,diesel fuel ,petroleum ,taxation and taxes ,value added tax

Prices of petrol and diesel in Tamil Nadu went up by Rs. 3.78 and Rs. 1.70 respectively, following the state government revising the Value Added Tax (VAT) on these products.

ఇంధన బాంబు పేలింది.. లీటరు పెట్రోల్‌పై రూ 3.78ల పెంపు

Posted: 03/05/2017 01:06 PM IST
Petrol price up by rs 3 78 diesel by rs 1 70 as tn revises vat

ఇంధన బాంబు పేలింది. అదేంటి ఫిబ్రవరి 28న రూపాయి  71 పైసల మేర పెంచిన కేంద్రం మరోమారు ఏకంగా లీటరుపై 3.78 పైసలు పెంచిందా..? అంటూ అవేదన వ్యక్తం చేయకండి. ఎందుకంటే పెరిగిన ఇంధన ధరలు దేశవ్యాప్తంగా కాదు.. కేవలం తమిళనాడులోనే పెరిగాయి. తమిళనాడులో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగాయి. పెట్రోల్‌పై రూ 3.78, డీజిల్‌పై రూ 1.70 పెరిగాయి. పెట్రోల్‌, డిజిల్‌పై తమిళనాడు ప్రభుత్వం వ్యాట్(వ్యాల్యూ ఆడెడ్‌ ట్యాక్స్‌) పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ధరల పెంపుపై తమిళనాడు పెట్రోలియం డీలర్స్‌ అసోసియేషన్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది.

 పెట్రోల్‌, డిజిల్‌ ధరల పెంపుతో సామాన్యులపై తీవ్రప్రభావం పడుతుందని, తక్షణమే ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. పెట్రోల్‌పై 27 శాతం ఉన్న వ్యాట్‌ను 34 శాతానికి పెంచగా, డీజిల్‌పై 21.4 శాతం ఉన్న వ్యాట్‌ను 25 శాతానికి పెంచారని అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ కే.పీ మురళి పేర్కొన్నారు. ధరలపెంపుతో రవాణా ఖర్చులు పెరిగి కూరగాయల దగ్గర నుంచి అన్ని వస్తువుల ధరలపై ప్రభావం పడే అవకాశం ఉందని తెలిపారు. తమిళనాడులో పెంచిన వ్యాట్‌తో పెట్రోల్‌ ధర లీటరుకు రూ. 75కు చేరింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Petrol  diesel  prices hiked  VAT revision  Tamil Nadu  VAT  petroleum  taxation and taxes  value added tax  

Other Articles