నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలో సర్కారు కొలువుల జాతర.. Central govt to hire 2.8 lakh more staff,

Central govt to hire 2 8 lakh more staff police i t customs to get lion s share

north block, income tax hiring, government hiring, customs hiring, central government recruitment, Central government, hire, 2.8 lakh staff, year, police, I-T & customs

The size of the central govt is likely to grow with the Centre's Budget providing for the recruitment of around 2.80 lakh more staff.

నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలో సర్కారు కొలువుల జాతర..

Posted: 03/02/2017 01:52 PM IST
Central govt to hire 2 8 lakh more staff police i t customs to get lion s share

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం చేయాలని కలలుదనే నిరుద్యోగులకు శుభవార్త. నిత్యం పరిమిత స్థాయిలో వెలువడే ఉద్యోగాలు ఈ సారి కాసింత భారీ స్థాయిలో చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్దమైంది. దీంతో ప్రభుత్వ ఉద్యోగం.. అందులోనూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికిది నిజంగా తీపి కబురుకేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో త్వరలోనే భారీ సంఖ్యలో కొలువుల జాతరకు తెరలేవనుంది.  2018 మార్చి నాటికి 2.84 లక్షల మందికి కొత్తగా ఉద్యోగాలు ఇవ్వాలని కేంద్ర బడ్జెట్ లో మోదీ సర్కార్ ప్రతిపాదించింది.

అ మేరకు బడ్జెట్ లో నిదులను కూడా కేటాయింపులు చేసింది. ముఖ్యంగా పోలీసు ,ఐటీ, కస్టమ్స్‌ శాఖకు ఈ నియామకాల్లో సింహభాగం దక్కనుంది. అందుకోసం ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టింది. ఇన్‌క‌మ్ ట్యాక్స్‌, క‌స్ట‌మ్స్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్‌ల‌లో ఈ ఉద్యోగాలు అధికంగా ఉండ‌నున్నట్లు స‌మాచారం. న‌ల్లధ‌న నిర్మూలన‌లో భాగంగా ఐటీ శాఖ‌పై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రస్తుతం ఆదాయ‌ప‌న్ను శాఖ‌లో 46 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. వ‌చ్చే ఏడాది మార్చి నాటికి ఆ సంఖ్య 80 వేల‌కు చేర‌నుంది.

కేంద్ర ప్రభుత్వం గ‌తేడాది జీఎస్టీ స‌వ‌ర‌ణ బిల్లు తీసుకొచ్చిన విష‌యం తెలిసిందే. దాన్ని అమ‌లు చేయ‌డానికి సిద్ధమ‌వుతున్న క‌స్టమ్స్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్‌కు కొత్తగా 41 వేల ఉద్యోగాలు రానున్నాయి. ప్రస్తుతం ఆ శాఖ‌లో 50,600 మంది ఉద్యోగులు ఉన్నారు. వ‌చ్చే ఏడాది ఆ సంఖ్య 91,700కు పెర‌గ‌నుంది. అయితే, రైల్వే శాఖ‌లో మాత్రం ఎటువంటి కొత్త ఉద్యోగాలు ఉండ‌బోవ‌ని కేంద్ర స‌ర్కారు స్ప‌ష్టం చేసింది. ఇక విదేశాంగ శాఖ‌లో కొత్తగా 2 వేల కొలువుల‌ను సృష్టించ‌నున్నారు. స‌మాచార శాఖ‌లోనూ కొత్తగా రెండు వేల‌కుపైగా ఉద్యోగాలు రానుండ‌గా, కేబినెట్ సెక్రటేరియ‌ట్‌లో ప్రస్తుతమున్న ఉద్యోగుల సంఖ్య 921 నుంచి వ‌చ్చే ఏడాది 1218కు పెంచాల‌ని కేంద్ర స‌ర్కారు క‌స‌ర‌త్తు చేస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Central government  hire  2.8 lakh staff  year  police  I-T & customs  

Other Articles