లేదు.. లేదు అంటూనే.. ఎమ్మెల్యేలకు బంఫర్ అఫర్ chandrababu gives special allowance to AP Mlas

Cm cbn gives special allowance to andhra pradesh mlas

Andhra Pradesh, N Chandrababu Naidu, Amaravati, Andhra Pradesh Legislature Assembly, AP Assembly, Rs 50,000 additional allowance, ap assembly, ap mlas, special allowance, kodela shiva prasad, Yanamala Ramakrishnudu

AP CM Chandrababu inaugurated the new Legislature building on the state government’s transitional headquarters premises at Velagapudi in the capital region of Amaravati.

లేదు.. లేదు అంటూనే.. ఎమ్మెల్యేలకు తాయిలం

Posted: 03/02/2017 03:34 PM IST
Cm cbn gives special allowance to andhra pradesh mlas

రాజధాని లేని రాష్ట్రంగా వున్న అంధ్రప్రదేశ్ సర్వోతోముఖాభివృద్దికి ప్రజలు స్వచ్చంధంగా విరాళాలు ఇవ్వాలని పిలుపునిచ్చి.. రాష్ట్రాభివృద్దిలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములుగా నిలవాలని చెప్పిన చంద్రబాబు.. అధికారంలోకి రాగానే రాష్ట్ర ప్రగతిని మర్చిపోయారా..? అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. అటు కేంద్రంతో రాజీ మార్గంలోనే వెళ్తూ.. వచ్చిన కాడికి నిధులను తీసుకుని ఊరుకుందాం.. కేంద్రంతో కయ్యం పెట్టుకుంటే మొదటికే మోసం వస్తుందని భావించారో ఏమో తెలియదు కానీ.. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని, దాని స్థానంలో ఇచ్చారని ప్రకటించుకుంటున్న ప్యాకేజీపై చట్టబద్దత అంశాలను అసులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

అర్థరాత్రి రాష్ట్రవిభజన చేసిన కాంగ్రెస్ ను దోషిగా చేస్తూ.. విమర్శలు గుప్పించి.. తమ రాష్ట్రాన్ని అత:పాతాళంలోకి నెట్టారని అవేదన, అందోళన వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి.. అధికారంలోకి రాగానే ఏకంగా ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసుకుని తన మంత్రివర్గంతో కలసి విదేశీయానాలు చేయడంపై ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తాయి. ఇక రాష్ట్రం అన్యాయానికి గురైందంటూ అవేధన వ్యక్తం చేస్తూనే.. మరోవైపు తమ శాషనసభ్యుల వేతనాలను అమాంతం పెంచేసుకుంటూ తీసుకున్న నిర్ణయంపై కూడా విమర్శలు వ్యక్తమయ్యాయి.

ఇక తాజాగా వెలగపూడిలో నిర్మించిన ఆంధ్రప్రదేశ్ నూతన శాసనసభను ప్రారంభిస్తూ తమ రాష్ట్ర ఎమ్మెల్యేలకు బంఫర్ అఫర్ ఫ్రకటించారు చంద్రబాబు. కొత్త అసెంబ్లీని స్పీకర్ కోడెల శివప్రసాద్, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడితో కలసి ప్రారంభించిన చంద్రబాబు, తన ఛాంబర్‌లో ప్రవేశించి, ఆపై అక్కడ తన మొట్టమొదటి పైలు మీద సంతకం చేశారు. తొలిసారిగా సొంత అసెంబ్లీ భవనంలో నిర్వహించే బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఎమ్మెల్యేలకు అదనంగా ఇస్తామన్న 50 వేల రూపాయల భత్యం ఫైలు మీద ఆయన సంతకం చేశారు. దాంతో మొత్తం ఎమ్మెల్యేలందరికీ ఈ కొత్త భవనం తాలూకు భత్యం అందనుంది.

అయితే రాష్ట్రంలో వున్న విపక్షాన్ని మాత్రం అవకాశం దోరికినప్పుడల్లా ఇరుకున పెట్టడంలో మాత్రం వ్యూహాత్మకంగా వ్యవహరించి పైచేయి సాధిస్తున్నారు. ఈ సందర్భంగా యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ.. శాసనసభ అందరిదీ అని, అయితే విపకకర్షానికి చెందిన సభ్యులు ఎందుకు హాజరుకాలేదో అర్థం కావడం లేదని మళ్లీ ఇరుకున పెట్టే వ్యాఖ్యలు చేశారు. అయితే మహిళా పార్లమెంటరీ సదస్సుకు హాజరైన విపక్ష ఎమ్మెల్యే రోజాను ఎలా ఇబ్బంది పెట్టింది మాత్రం ఆయన ప్రస్తావించలేదు. ఇక నందిగామాలో జరిగిన దివాకర్ బస్సు ప్రమాదంపై ఘటనాస్థాలానికి వెళ్లి వివరాలు తెలుసుకున్న విపక్ష నేతపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందన్న విషయాన్ని పక్కటి బెట్టి.. వారు ఎందుకు రాలేదో అంటూ అంగలార్చడం మాత్రం అధికార పార్టీకే చెల్లుతుందన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chandrababu  kodela shiva prasad  Yanamala Ramakrishnudu  ap assembly  ap mlas  amaravati  

Other Articles