బావ సాయం.. సౌందర్య క్షేమం.. రాజీ కుదిరిందహో..! Dhanush comes to Soundarya’s help after an accident

Soundarya rajinikanth hits auto with her car injures driver

soundarya rajinikanth, soundarya rajinikanth accident, soundarya rajinikanth roads mishap, soundarya rajinikanth mishap, soundarya rajinikanth road acident, soundarya rajinikanth dhanush, soundarya rajinikanth auto driver, soundarya rajinikanth daughter, soundarya rajinikanth tamil cinema, soundarya rajinikanth director, soundarya rajinikanth filmmaker, soundarya rajinikanth news, soundarya rajinikanth updates, tamil industry, tamil cinema, entertainment updates

Actor Dhanush’s timely action saved Rajinikanth’s daughter from police action after she met with an accident, when her car hit an auto rickshaw in Chennai.

బావ సాయం.. సౌందర్య క్షేమం.. రాజీ కుదిరిందహో..!

Posted: 02/28/2017 05:08 PM IST
Soundarya rajinikanth hits auto with her car injures driver

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె, దర్శకురాలు సౌందర్య ఇవాళ ఓ ప్రమాదంలో చిక్కుకున్నారు. తమిళనాడు రాజధాని చెన్నైలోని అల్వార్ పేట ప్రాంతంలో అమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. వేగంగా దూసుకువచ్చిన అమె ఓ ఆటో రిక్షాను ఢీకొట్టింది. ఈ ఘటనలో సౌందర్యకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. కాగా ఆటో డ్రైవర్ గాయపడగా, అతని ఆటో ధ్వంసమంది. తన ప్రాణాలతో చెలగాటమాడిన సౌందర్యను గుర్తించని అటో డ్రైవర్.. అమెపై పోలీసులకు పిర్యాదు చేసేందుకు సస్నధమయ్యాడు. అయితే అదే సమయంలో ఘటనాస్థలానికి చేరుకున్న రజనీకాంత్ మేనల్లుడు.. హీరో ధనుష్.. కేసు లేకుండా రాజీకుదర్చడంతో సౌందర్య ఊపిరిపీల్చుకుంది.

చెన్నైలోని కోర్టు అదేశాల మేరకు ఇవాళ న్యాయస్థానం ఎదుట హాజరైన ధనుష్ కోర్టులో వ్యవహారాలను చూసుకుని తిరిగివస్తున్న క్రమంలో సౌందర్య రజనీకాంత్ కారు ప్రమాదానికి గురయ్యారని, అయితే అమెకు ఎలాంటి ప్రమాదం జరగలేదని, కాగా ఆటో డ్రైవర్ కు గాయాలయ్యాయని తెలుసుకుని హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. వైద్య ఖర్చులతో పాటు పరిహారం కూడా ఇస్తామని, కేసు లేకుండా రాజీ చేసుకుందామని చెప్పి ధనుష్‌.. ఆటో డ్రైవర్‌ను ఒప్పించాడు. ఒక స్టార్ హీరో తనయ, మరో స్టార్ హీరో ధనుష్ తనను ఒప్పంచడంతో అటో డ్రైవర్ అందుకు అంగీకరించాడు.

దీంతో సౌందర్యపై పోలీసులకు పిర్యాదు అందకుండా, అమెపై ఎలాంటి కేసు నమోదు కాకుండా ధనుష్ కాపాడాడు. ప్రమాదం జరిగిన సమయంలో సౌందర్య కారును స్వయంగా నడిపారా లేక డ్రైవర్ ఉన్నాడా అన్న విషయం తెలియరాలేదు. రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్యను ధనుష్ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. రజనీ రెండో కుమార్తె సౌందర్య ఓ సినిమాకు దర్శకత్వం వహిస్తోంది. ఈ సినిమాలో ధనుష్, కాజోల్, అమలాపాల్ తదితరులు నటిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dhanush  Soundarya  Rajinikanth  Kollywood  Chennai  Alwarpet  South stars  Tamil films  

Other Articles

Today on Telugu Wishesh