సీరియల్ నెంబర్లు లేని రూ. ఐదు వందల నోట్లు.. ATM dispenses Rs 500 currency notes without serial numbers

Atm dispenses rs 500 currency notes without serial numbers

fake notes, demonetisation, no serial number, rs 500 notes, note ban, 500 fake notes, rs 2000 fake note, counterfeit currency, madhya pradesh fake notes, narendra modi, modi, india news, post demonetisation, demonetise errors, RBI, Shaktikanta Das, finance ministry, arun jaitley, pm modi, finance

Adding to the series of new bank notes with errors, an ATM in Damoh district in Madhya Pradesh has dispensed new Rs 500 notes without serial numbers.

ఏటీఎం నుంచి సీరియల్ నెంబర్లు లేని రూ. ఐదు వందల నోట్లు..

Posted: 02/28/2017 03:59 PM IST
Atm dispenses rs 500 currency notes without serial numbers

కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లు రద్దు నిర్ణయం తీసుకున్న తరువాత యావత్ దేశం ఒక్కసారిగా అంగలార్చింది మాత్రం నోటు కోసమే. చేతిలో డబ్బులు లేక.. వున్న నోట్లుకు అదరణ కరువై వాటిని బ్యాంకులలోనే జమ చేయాలన్న నిబంధనలతో డబ్బు, డబ్బు, డబ్బు అని ఏకరువు పెట్టారు. దీంతో అందుబాటులోకి వచ్చిన కొత్త రెండు వేల రూపాయల నోటుకు చిల్లర లభించక.. అది వుండీ కూడా లాభం లేకుండాపోయింది. యాభై రోజుల్లో మనీ సమస్యకు ముగింపు పలుకుతామని ప్రధాని ధీమాగా చెప్పినా.. అది సాధ్యపడలేదు.

ఇప్పటికీ నాలుగు రోజులు వరుసగా సెలవులు లభిస్తే.. కరెన్సీ నోట్లు కోసం ప్రజలు అనేక ఏటీయం కేంద్రాల చుట్టూ తిరగకతప్పని పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. ఈ విషయాన్ని పక్కనబెడితే.. పెద్ద నోట్ల రద్దు తరువాత అందుబాటులోకి వచ్చిన కోత్త నోట్లలో అనేక తప్పులు దొర్లుతున్నాయి. పాత నోట్ల రద్దు నేపథ్యంలో హైదరాబాద్ పరిసరాల్లో అందుబాటులోకి వచ్చిన ఐదు వందల రూపాయల నోట్లలో అనేక తప్పులు దోరడంతో అది కాస్తా సంచలనంగా మారింది. దీంతో అర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ రంగంలోకి దిగి ఆ నోట్లను ప్రభుత్వమే ప్రైవేటు ప్రాంతాల్లో ముద్రిస్తుందని, అది అర్బీఐ తప్పుకాదని వెల్లడించారు.

దీంతో తప్పుల తడకగా ముద్రించిన నోట్లను కేంద్రం వెంటనే వెనక్కు తీసుకుని మళ్లీ కొత్తగా రూపాయల ఐదు వందల నోట్లును ముద్రించే పనిని చేపట్టింది. ఆనక మరో పక్షం రోజుల తరువాత హైదరాబాద్ సహా శివారు ప్రాంతాల ప్రజలను ఐదు వందల నోట్లు పలుకరించాయి. దీంతో కొత్త నోట్ల కష్టాలకు, దీనికి తోడు కొత్త పెద్ద నోటు రెండు వేల నోటుకు చిల్లర కష్టాలకు కూడా బ్రేకులు పడ్డాయి. అయితే నవంబర్ ఎనమిదిన పెద్ద నోట్లు రదై.. సుమారు నాలుగు నెలలు కావస్తున్నా.. ఇంకా తప్పుడు ముద్రణలు మాత్రం వెలుగుచూస్తూనే వున్నాయి..

* ఏటీయం కేంద్రంలో నకిలీ నోట్ల రావడం కలకలం రేపింది
* ఏటీయం కేంద్రాల నుంచి ఉత్తుత్తి నోట్లు రాక
* గాంధీ బొమ్మలేని నోట్లు సంచలనం రేపాయి
* పిల్లలాడుకునే భారతీయ మనోరంజన్ పేరుతో బొమ్మనోట్లు
* తాజాగా సిరీయల్ నంబర్ లేని నోట్లు వచ్చాయి.

మధ్యప్రదేశ్ లోని దామోహ్ జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలవరాన్ని రేపింది. ఇది వరకు చిల్డ్రన్స్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పేరుతో ఉన్న నోట్లు కూడా ఈ బ్యాంక్ ఏటీయం నుంచే రావటంతో అందరూ అవాక్కవుతున్నారు. మధ్యప్రదేశ్‌లో ఏటీయం వెళ్లిన ఓ స్కూల్ టీచర్ కు సీరియల్‌ నెంబర్‌లేని ఐదు వందల రూపాయల నోట్లు రావడంతో ఖంగుతిన్నారు. జాతీయ బ్యాంకు.. స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఏటీయంలో ఈ రకం నోట్లు రావటం సంచలనం అయ్యింది.

ఏటీయం నుంచి రూ.వెయ్యి డ్రా చేయగా అందులో రెండు.. ఐదు వందల నోట్లు సీరియల్ నంబర్ లేకుండా వచ్చాయని గుర్తించారు. మరో ఖాతాదారుడు కూడా డబ్బు డ్రా చేయగా సీరియల్ నంబర్ లేని నోట్లే వచ్చాయి.ఈ విషయాన్ని స్థానిక పోలీసులకు సమాచారం అందించారు ఖతాదారులు. రంగంలోకి దిగిన పోలీసులు.. ఏటీయంను మూసివేశారు. బ్యాంకు అధికారులకు సమాచారం ఇచ్చారు. సీరియల్ నంబర్ లేని నోట్లను మార్చేందుకు బ్యాంకు తొలుత నిరాకరించారని చెప్పాడు. అయితే ఈ విషయం కాస్తా మీడియా దృష్టికి వెళ్లిన తరువాత కొంత సమయం తరువాత వాటిని మారుస్తామని బ్యాంకు అధికారులు మాటమార్చారని టీచర్ నారాయణ్ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : new Rs. 500 note  serial number  errors  demonetisation  RBI  arun jaitley  pm modi  

Other Articles