కాన్సాస్ కాల్పుల ఘటన కల అయితే బాగుండు..! Alok Madasani, speaks about his friendship and inncident

Olathe victim looks at positive side and how the community reacted after shooting

United States of America, Srinivas dead body, sunayana, alok madasani, alok madasani speaks, olathe shooting, Ian Grillot, austins shooting, interview, shooting, hate crime, adam purinton,

Alok Madasani, One of the victims of last week's shooting at Austins Bar & Grill in Olathe spoke at a gathering after hundreds march in support of victims.

కాన్సాస్ కాల్పుల ఘటన కల అయితే బాగుండు..!

Posted: 02/28/2017 12:38 PM IST
Olathe victim looks at positive side and how the community reacted after shooting

కోటి అశలతో అగ్రరాజ్యంలో అడుగుపెట్టి తమ నైపుణ్యంతో రాణిస్తూ, సజావుగా సాగుతున్న తమ పయనంలో.. జాతి వైషమ్యం తలకెక్కిన ఓ దుర్మార్గుడు విద్వేషపూరితంగా కాల్పులకు తెగబడటం తో తన ప్రాణస్నేహితుడిని కోల్పోయానని.. ఆ కాల్పుల్లో బుల్లెట్ గాయాలై చికిత్స సోందుతున్న అలోక్ మదసాని అవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన తన గుండెలను పిండేసిందని, తొమ్మిదేళ్లుగా కొనసాగతున్న తమ స్నేహాబంధానికి ఇలా ముగింపు పలుకుతుందని తాను ఎన్నడూ భావించలేదని.. ఇదంతా కలగా మారింతే ఎంతో బాగుండు అని కన్నీటి పర్యంతమౌతూ అన్నాడు.

ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అవుతూనే కూచిభొట్ల శ్రీనివాస్ సంస్మరణార్థం ఏర్పాటుచేసిన కార్యక్రమానికి చేతికర్రల సాయంతో వచ్చి ఘటనపై స్పందిస్తూ.. ఇది కేవలం ఒక వ్యక్తి చేసిన ఘటనే తప్ప కాన్సాస్ ప్రాంత అసలైన స్ఫూర్తిని ఏమాత్రం దెబ్బతీయలేదని అన్నారు. దాంతో ఒక్కసారిగా ఆ సదస్సు జరిగిన హాల్ చప్పట్లతో మార్మోగింది. అమెరికాలో నిస్వార్థపరులు, కష్ట జీవులు ఉంటారని, ఆరోజు రాత్రి జరగకూడని ఘటన జరిగిందని అలోక్ చెబుతూ తనకు శ్రీనివాసత్ తో వున్న అనుబంధాన్ని పంచుకున్నారు.

తాను అమెరికాకు రావడానికి ప్రధాన కారణం శ్రీనివాసేనన్నాడు. తొమ్మిదేళ్ల నుంచి మేమిద్దరం మంచి స్నేహితులమని. ఇద్దరం కలిసే ఉద్యోగానికి వెళ్లేవాళ్లమని, తిరిగి వచ్చేటప్పుడు సరదాగా గడిపే వాళ్లమని చెప్పారు. ఇక్కడ కష్టంగా ఉందని గానీ, తిరిగి వెళ్లిపోదామని గానీ శ్రీనివాస్ ఏరోజూ చెప్పలేదని. గత ఆరు నెలలుగా ప్రతిరోజూ నా అపార్టుమెంటు దగ్గరకు వచ్చి, తన కారులో ఎక్కించుకుని ఆఫీసుకు తీసుకెళ్లేవాడని గుర్తు చేసుకున్నాడు. తాను కారు కొనేవరకు శ్రీనివాస్ కూడా కారు కొనకుండా ఆగాడని.. అంత మంచి మనసు మా శ్రీనుదని కన్నీళ్ల పర్యంతమవుతూ మరిన్నీ విషయాలను పంచుకున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles